అంతర్జాతీయం

భారత్‌తో బలమైన మైత్రే ట్రంప్ లక్ష్యం: అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 24:్భరత్‌తో బలమైన సంబంధాలను కొనసాగించడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ స్పష్టం చేశారు. రెండు దేశాలూ భద్రతాపరంగా ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కలిసి పనిచేస్తే ఎన్నో ప్రయోజనాలనూ పొందే అవకాశం ఉందని అన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆయన శుక్రవారం పెంటగాన్‌లో సమావేశమై కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు దేశాలు కలసికట్టుగా ముందుకెళ్లే రీతిలో సరికొత్త మార్గాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని దోవల్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఎప్పటికప్పుడు మైత్రీబంధం కొత్త పుంతలు తొక్కినప్పుడే అన్ని విధాలుగా బలపడే అవకాశం ఉంటుందని అన్నారు.