అంతర్జాతీయం

నైట్‌క్లబ్‌లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిన్సినాటి, మార్చి 26: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో ఉలిక్కిపడింది. ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటి నైట్‌క్లబ్‌లోకి ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు సాయుధులు చొరబడి జనంపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఒకరు చనిపోగా, మరో 14 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో క్లబ్ జనంతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే ఎవరినీ అనుమానించడం లేదని అధికారులు చెప్తున్నారు. శనివారం రాత్రి కావడంతో నైట్‌క్లబ్‌లో చాలామంది యువకులు ఉన్నారని, గతంలోకూడా ఇక్కడ కాల్పుల సంఘటనలు జరిగాయి కానీ, ఇది వాటన్నిటికన్నా దారుణమైందని పోలీసు అధికారి కిమ్ విలియమ్స్ చెప్పారు. క్లబ్‌లో ఉన్న భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు తెలుసుకొంటుండగా మరికొందరు గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందిస్తూ కనిపించారు. మృతుడి వివరాలు తెలుసుకోవడానికి కూడా అధికారులు యత్నిస్తున్నారని కిమ్ విలియమ్స్ చెప్పారు.
గాయపడిన వారిలో కొంతమంది స్వయంగా దగ్గర్లోని ఏరియా ఆస్పత్రులకు వెళ్లగా, మరికొందరిని అంబులెన్స్‌లలో తరలించారు. అధికారులు పలువురు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నారు.