అంతర్జాతీయం

మా వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 30: భారత్ తన అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటోందని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి నిధులు అందజేస్తోందని కూడా ఆరోపించింది. పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తమ దేశంలో భారత ‘గూఢచారి’ కుల్‌భూషణ్ జాదవ్ అరెస్టు కావడమే ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందనడానికి సాక్ష్యమని అన్నారు. ‘పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలలో భారత్ జోక్యం గురించి మొత్తం ప్రపంచానికి తెలుసు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి వారు నిధులు అందజేస్తున్నారనేది వాస్తవం’ అని జకారియా అన్నారు. దక్షిణ ముంబయిలో గల పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా నివసించిన ఇల్లు ‘జిన్నా హౌస్’ భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇంటిని కూల్చివేసి, దాని స్థానంలో సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాలని బిజెపి ఎమ్మెల్యే మంగళ్ ప్రభాత్ లోధా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ఆ భవనం ప్రాధాన్యతను గుర్తించి, దాన్ని కూల్చకుండా గౌరవించాలని ఆయన కోరారు. భారత సైనిక బలగాలు కాశ్మీర్‌లో పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ‘అమాయకులయిన, రక్షణ కొరవడిన కాశ్మీరీల రక్తం నిరంతరం పారుతుండటంపై మేము తీవ్ర విచారం, దిగ్భ్రాంతితో ఉన్నాం. గట్టిగా ఖండిస్తున్నాం’ అని జకారియా పేర్కొన్నారు. కాశ్మీర్‌లో మంగళవారం ముగ్గురు పౌరులు, ఒక మిలిటెంట్ మృతి చెందడంపై ఆయన స్పందిస్తూ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్స్ ఇండిపెండెంట్ పర్మనెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఐపిహెచ్‌ఆర్‌సి) పాకిస్తాన్ ఆధీనంలోని కాశ్మీర్‌లో పర్యటించి, భారత్ అకృత్యాల బాధితులయిన కాశ్మీరీల నుంచి వివరాలు సేకరిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు.

చిత్రం..నఫీస్ జకారియా