అంతర్జాతీయం

ఎన్నికల ప్రక్రియలను సమగ్రంగా పరిశీలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మార్చి 30: ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ పనితీరును పునర్ వ్యవస్థీకరించి, పునరుత్తేజింపచేసే దిశలో తొలి అడుగుగా జనరల్ అసెంబ్లీలో ఎన్నికల ప్రక్రియలను సమగ్రంగా పరిశీలించాలని భారత్ పిలుపునిచ్చింది. జనరల్ అసెంబ్లీ సమర్థత, పటుత్వానికి దాని నాణ్యమైన పని పద్ధతులు ఎంతో ముఖ్యమని ఐరాసకు భారత శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్ అంజని కుమార్ పేర్కొన్నారు. అందువల్ల ఈ పని పద్ధతులు కాలానుగుణంగా మారాలని, అలాగే మారుతున్న స్థితిగతులు, వాస్తవ పరిస్థితుల అవసరాలను ప్రతిబింబించాలని అన్నారు. జనరల్ అసెంబ్లీ పని పద్ధతులపై బుధవారం ఇక్కడ జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘జనరల్ అసెంబ్లీని గ్లోబల్ పార్లమెంట్‌గా పరిగణించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనరల్ అసెంబ్లీని పునరుత్తేజింప చేసే ప్రక్రియ ప్రారంభం కావడానికి అది నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలు దోహదపడేలా ఉండాలి’ అని అన్నారు. అత్యధిక దేశాల ప్రాతినిధ్యం కలిగిన ప్రపంచ సంస్థ అయిన ఐరాస జనరల్ అసెంబ్లీ ఉత్తమ ఎన్నికల ప్రక్రియలను అనుసరించడం ద్వారా ఇతర సంస్థలకు ఆదర్శంగా ఉండాలని, తన స్థాయికి తగిన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని ఆయన పిలుపునిచ్చారు. జనరల్ అసెంబ్లీ నిలకడగా తన కీలకమైన బాధ్యతలను ఎలా పోగొట్టుకున్నదనే విషయాన్ని భారత్, ఇతర అనేక సభ్యదేశాలు ఎలా ఎత్తిచూపాయో అనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.