అంతర్జాతీయం

ఆలయాల రక్షణకు బ్రిటన్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 3: బ్రిటన్‌లో ఒక హిందూ దేవాలయం, గురుద్వారాలలో రక్షణ కోసం ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. నైరుతి ఇగ్లండ్‌లోని ఓ హిందూ దేవాలయం, గురుద్వారాలలో సిసిటివిలు, రక్షణ కోసం లైట్లను, గేట్, ఫెన్సింగ్ కోసం 9,319.20పౌండ్లను కేటాయిస్తున్నట్లు యూకే హోం శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఇది ఏ దేవాలయం అన్నది వెల్లడించలేదు. అదే సమయంలో తూర్పు ఇంగ్లండ్‌లో ఒక మసీదులో సిసిటివిలు, డోర్‌లాక్‌లు, కోసం 7232పౌండ్లను అందిస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ మిడ్‌లాండ్‌లో 10,012.80 పౌండ్లను ఒక చర్చికి అందించారు. ప్రార్థనామందిరాల రక్షణ నిధి కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు వివరించారు. మొత్తం 45 చర్చిలు, 12మసీదులు, ఒక దేవాలయం, ఒక గురుద్వారాకు మొత్తం నాలుగు లక్షల పౌండ్లను సెక్యూరిటీ నిధులు విడుదల చేశారు.