అంతర్జాతీయం

రష్యాలో ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, ఏప్రిల్ 3: రష్యా రెండో ప్రధాన నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ మెట్రో స్టేషన్‌లో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం పదిమంది మరణించారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి వెనుక ఉగ్రదాడిని అనుమానిస్తున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయితే పేలుడుకు గల అన్ని కారణాలనూ దర్యాప్తు అధికారులు విశే్లషణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘ఈ పేలుడు ఉగ్రమూకల పనా లేక ప్రమాద వశాత్తు జరిగిందా, నేరస్థులెవరైనా చేశారా అన్నది విచారణాధికారులు దర్యాప్తు చేస్తారు’ అని అన్నారు. స్థానిక కాలమానం
మధ్యాహ్నం 2.40 గంటలకు మెట్రో స్టేషన్‌లో ఓ రైలు సమీపంలో పేలుడు జరిగింది. ఒక్కసారిగా పేలుడు జరగటంతో ఏం జరిగిందో తెలియక జనం హాహాకారాలు చేస్తూ స్టేషన్ బయటకు పరుగులు పెట్టారు. అయితే ఓ రైలు డోరు దగ్గర మనుషులు కుప్పలుతెప్పలుగా పడి కనిపించారని, వారిలో ఎందరు బతికి ఉన్నారో.. ఎందరు చనిపోయారో తెలియలేదని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. రష్యా ఉగ్రవాద వ్యతిరేక కమిటీ (ఎన్‌ఏకె) ప్రతినిధి ఆండ్రే ప్రజెజ్‌డోమ్‌స్కీ మాట్లాడుతూ పదిమంది చనిపోయినట్లు ప్రాథమిక గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. ఒక్కసారిగా ఘటన జరగటంతో రష్యాలోని అన్ని మెట్రో స్టేషన్లను మూసివేశారు. లోకల్ రైళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మెట్రో నెట్‌వర్క్ ప్రకటించింది. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు పుతిన్ సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లోనేని స్ట్రెల్నా అధ్యక్ష భవనంలో అధికారిక సమావేశంలో ఉన్నారు. మృతుల కుటుంబాలకు పుతిన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ కూడా ఈ ఘటనపై తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ అంశంలో రష్యా వెన్నంటి ఉంటామని ఈయూ విదేశీ విధాన చీఫ్ ఫెదెరికా మొఘెరిని ట్విట్టర్‌లో తెలిపారు. గతంలోనూ రష్యా రవాణా వ్యవస్థపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.