అంతర్జాతీయం

సిరియాలో విషవాయువు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షేఖున్, ఏప్రిల్ 4: సిరియాలో ప్రభుత్వం, తిరుగుబాటు వర్గాల మధ్య సాగుతున్న పోరు సామాన్య ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. తిరుగుబాటుదారులపై సిరియా ప్రభుత్వం వైమానిక దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిపిన విషవాయువు దాడిలో పలువురు చిన్నారులు సహా 58 మంది చనిపోయినట్లు బ్రిటన్‌లోని సిరియా పౌరహక్కుల సంస్థ ఆరోపించింది. ఇద్లిబ్ రాష్ట్రం ఖాన్ షేఖున్ పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున గ్యాస్ దాడులు జరిగాయని, పలువురు వాంతులు, స్పృహ కోల్పోవడం లాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఈ దాడికి గురయిన బాధితులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రి ప్రవేశద్వారం కూడా దాడిలో దెబ్బతిన్నదని దని ఆ సంస్థ ఆరోపించింది. గ్యాస్ దాడికి ఉపయోగించిన విష పదార్థం ఏమిటో అంచనా వేయలేకపోయామని ఆ సంస్థ తెలిపింది. దాడి జరిపిన యుద్ధ విమానం సిరియా ప్రభుత్వానిదా లేక రష్యాకు చెందినదా అనే విషయం కూడా నిర్ధారణ కాలేదని పేర్కొంది. కాగా, ఈ దాడిలో 11 మంది చిన్నారులు సహా 58 మంది చనిపోయారని, మరో 160 మంది గాయపడ్డారని ఆ సంస్థ తెలిపింది. సిరియా భవితవ్యంపై చర్చించడానికి బ్రస్సెల్స్‌లో మరో రెండు రోజుల్లో ఐరోపా సమాజం, ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఓ సమావేశం జరుగనున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం.

చిత్రాలు..డమాస్కస్ శివార్లలో సిరియా ప్రభుత్వం చేస్తున్న వైమానిక దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీస్తున్న చిన్నారులు, మహిళలు
*విషవాయువు దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ చిన్నారికి చికిత్స అందిస్తున్న దృశ్యం