అంతర్జాతీయం

సిరియాపై మరిన్ని ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 8: రసాయన దాడులు నిర్వహిస్తోందని సిరియాపై ఆరోపణలు చేస్తున్న అమెరికా ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ చర్యలను నిరోధించటానికి త్వరలోనే ఆంక్షలను ప్రకటించనున్నట్లు ట్రంప్ అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం జరిపిన దాడిలో సిరియా వాయుసేనకు చెందిన 20శాతం ధ్వంసం అయినట్లు భావిస్తున్నామని, ఇంకా దూకుడుగా వ్యవహరించి సిరియాను నియంత్రించాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లెర్‌సన్ తెలిపారు. కాగా సిరియాపై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా, ఇరాన్ అధికారులు టెహ్రాన్‌లో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని వారు పేర్కొన్నారు. సిరియాకు పూర్తి అండగా ఉంటామని ప్రకటించారు. అమెరికా వ్యవహారంపై చర్చించేందుకు భద్రతామండలిని వెంటనే సమావేశపరచాలని ఐక్యరాజ్యసమితిని డిమాండ్ చేశారు. చివరి టెర్రరిస్టు అంతమయ్యేంత వరకూ సిరియాకు దన్నుగా నిలుస్తామని స్పష్‌టం చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్తున్న ట్రంప్ చేసిన చర్య పట్ల సిరియాలో ఉగ్రవాదులు పండుగ చేసుకుంటున్నారని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ అన్నారు.