అంతర్జాతీయం

మలాలా ఇక ఐరాస శాంతి దూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్ 8: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయి అతి పిన్న వయస్కురాలయిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) శాంతి దూత (మెసెంజర్ ఆఫ్ పీస్)గా అవతరించడానికి రంగం సిద్ధమయింది. ఐరాస ప్రదానం చేసే ఈ అత్యున్నత గౌరవానికి మలాలాను ఆ సంస్థ సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెర్స్ ఎంపిక చేశారు. మలాలాను ఐరాస శాంతి దూతగా ప్రకటించే కార్యక్రమం వచ్చే వారం ఇక్కడి ఐరాస ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ‘ముప్పు ముంగిట ఉన్నప్పటికీ మలాలా మహిళలు, బాలికలు, మొత్తం ప్రజల హక్కుల పట్ల దృఢమైన నిబద్ధతను ప్రదర్శించారు’ అని ఐరాస సెక్రెటరి జనరల్ మలాలాను ఐరాస శాంతి దూతగా ఎంపిక చేసిన సందర్భంగా అభివర్ణించారు. ‘బాలికా విద్య కోసం ఆమె సాహసోపేత కార్యకలాపాలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి ఉత్తేజాన్ని, శక్తిని ఇచ్చాయి’ అని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో తాలిబన్ల హెచ్చరికలను లెక్క చేయకుండా పాఠశాలకు వెళ్లిన మలాలాపై ఉగ్రవాదులు 2012 అక్టోబర్‌లో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రాణాలతో బయటపడిన ఆమె బాలికలు, మహిళల హక్కుల కోసం పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2014 డిసెంబర్‌లో మలాలాను నోబెల్ శాంతి బహుమతి వరించింది. భారత్‌లో బాలల హక్కుల కోసం పాటుపడుతున్న కైలాస్ సత్యార్థితో కలిసి ఆమె ఈ పురస్కారాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఆంటోనియో గుటెర్స్ ప్రకటించిన తొలి ఐరాస శాంతి దూత మలాలా కావడం విశేషం.