అంతర్జాతీయం

వంద రోజుల ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ పామ్ బీచ్, ఏప్రిల్ 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తమ తొలి సమావేశంలో ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవడానికి వంద రోజుల ప్రణాళికను ప్రకటించారు.
ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన చర్చల్లో తీసుకున్న స్పష్టమైన నిర్ణయం ఇదొక్కటే. సిరియాపై అమెరికా జరిపిన క్షిపణి దాడి ప్రభావం ఈ ఇద్దరి భేటీపైనా పడింది. ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్ అ లాగో రిసార్ట్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం ఫలవంతమయిందని ఈ భేటీలో పాల్గొన్న ట్రంప్ సహాయకులు చెప్పారు. ఇద్దరు నేతలు కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరచుకోవడానికి సానుకూలతను వ్యక్తం చేశారని తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో చైనాకు అనుకూలంగా ఉన్న అసమతుల్యతను సరిచేయడానికి దోహదపడే వాణిజ్య చర్చలను వేగవంతం చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయని అమెరికా ఆర్థిక మంత్రి విల్బుర్ రాస్ శుక్రవారం తెలిపారు. చైనా ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోవడం వల్ల ఎదురవుతున్న సవాళ్లను ట్రంప్ ఈ సమావేశంలో లేవనెత్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరి సియాన్ స్పైసర్ చెప్పారు. అమెరికా ఉద్యోగాలు, ఎగుమతులపై చైనా పారిశ్రామిక, వ్యవసాయ, టెక్నాలజి, సైబర్ విధానాలు చూపుతున్న ప్రభావంపై ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించడానికి చైనా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ట్రంప్ ఈ చర్చల్లో నొక్కి చెప్పారు. చైనాతో చర్చల్లో అమెరికా ఎంతో సాధిస్తుందని అంచనా వేసినప్పటికీ, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగు పరచడానికి వంద రోజుల ప్రణాళికను మాత్రమే ప్రకటించారని ‘ద న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.
ప్రస్తుతం చైనా అమెరికాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. నిరుడు ఇరు దేశాల మధ్య 519.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇరు దేశాలు దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్న 1979లో వీటి మధ్య జరిగిన వాణిజ్యం 2.5 బిలియన్ డాలర్లే. అయితే ఇరు దేశాల అధ్యక్షుల భేటీపై సిరియా సంక్షోభం ప్రభావం పడింది. జి జిన్‌పింగ్‌తో కలిసి రాత్రి భోజనం చేయడానికి కొంచెం ముందు ట్రంప్ సిరియా వైమానిక స్థావరంపై భారీ దాడి చేయవలసిందిగా తన దేశ సైన్యాన్ని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ఇరు దేశాల నేతల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని, ఫలవంతమయ్యాయని చైనా ప్రభుత్వ వార్తాసంస్థ ‘జిన్హువా’ తెలిపింది. ఇరువురు నేతలు తమ ద్వైపాక్షిక సహకారంలోని కీలక అంశాలపైనా, ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపైనా తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారని వివరించింది. ఇదిలా ఉండగా, ఈ సంవత్సరం చైనాను సందర్శించాల్సిందిగా ట్రంప్‌ను జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ట్రంప్ అంగీకరించారని స్పైసర్ చెప్పారు.

చిత్రం..చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు స్వాగతం పలుకుతున్న డొనాల్డ్ ట్రంప్