అంతర్జాతీయం

ఈజిప్టులో జంట పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, ఏప్రిల్ 9: ఈజిప్టులోని టాంటా, అలెగ్జాండ్రియా నగరాలలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు ఆదివారం జరిపిన జంట పేలుళ్లలో 45 మంది మృతి చెందారు. సుమారు 119 మంది గాయపడ్డారు. క్రైస్తవులకు ‘పామ్ సండే’ పవిత్ర దినం కావడంతో ప్రార్థనలు చేయడానికి పెద్ద ఎత్తున చర్చీలకు వచ్చిన ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఇటీవలి సంవత్సరాలలో ఈజిప్టులో మైనారిటీ క్రైస్తవులపై ఇంత పెద్ద దాడి జరగడం ఇదే మొదటిసారి. కైరోకు 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న టాంటా నగరంలోని కోప్టిక్ చర్చ్ ఆఫ్ మార్ గిర్గిస్‌లో సంభవించిన మొదటి పేలుడులో 25 మంది మృతి చెందగా, 71 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పేలుడు పరికరాన్ని పట్టుకొని ఒక వ్యక్తి చర్చిలోపల ప్రార్థనలు జరుగుతున్న ప్రదేశంలోకి వచ్చాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి తెగబడ్డాడని మరికొందరు చెప్పారు. చర్చి హాలులోని మొదటి వరుసలో ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. ఈ దాడిలో మృతి చెందిన వారిలో టాంటా కోర్టు అధిపతి సామ్యూల్ జార్జ్ కూడా ఉన్నారు. దీని తరువాత కొన్ని గంటలకు అలెగ్జాండ్రియాలోని మాన్షియా జిల్లాలో గల సెయింట్ మార్క్‌కు చెందిన కోప్టిక్ ఆర్థోడాక్స్ కాథెడ్రాల్ చర్చిలో ఆత్మాహుతి బాంబర్ దాడికి దిగాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పోలీసులు సహా 11 మంది మృతి చెందగా, 66 మంది గాయపడ్డారు. ఈ రెండో సంఘటనలో ఆత్మాహుతి బాంబర్ ప్రణాళిక ప్రకారం చర్చి లోపల తనకు చుట్టుకున్న పేలుడు పదార్థాలతో కూడిన బెల్టును పేల్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని చర్చి లోపలికి రాకుండా మధ్యలో అడ్డుకున్నారు. దీంతో ఈ పేలుడులో అతడిని అడ్డుకున్న ఒక పోలీసు అధికారి, మరో మహిళా పోలీసు, ఇంకో దిగువ స్థాయి పోలీసు అధికారి మృతి చెందారని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.