అంతర్జాతీయం

భారతీయుడు జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: గూఢచర్యం, కుట్రపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న అభియోగాలపై భారత జాతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన భారత్ పాక్ సైనిక కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. జాధవ్‌ను ఉరితీస్తే అది ఓ పథకం ప్రకారం జరుగుతున్న హత్యే అవుతుందంటూ నిప్పులు చెరిగింది. జాధవ్‌కు మరణ శిక్ష విధించే రీతిలో ట్రయల్ కోర్టులో జరిగిన విచారణ హాస్యాస్పదంగా ఉందని కూడా అభివర్ణించింది. మాజీ సైనిక అధికారి అయిన 46 సంవత్సరాల జాదవ్‌కు మరణ శిక్ష విధించిన విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బవేజా ధృవీకరించారు. పఠాన్‌కోట్, ఊరీ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇప్పటికే క్షీణించిన భారత్-పాక్ సంబంధాలకు జాదవ్‌కు విధించిన మరణ శిక్ష పెను విఘాతం కలిగించే అవకాశం కనిపిస్తోంది. జాదవ్‌పై దాఖలైన అన్ని అభియోగాలు నిర్థారితమయ్యాయని సైనిక కోర్టు ప్రకటించింది. సైనిక కోర్టు విచారణను రహస్యంగా నిర్వహించారు. దౌత్య పరమైన సహాయాన్ని తీసుకునే అవకాశాన్ని కూడా ఆయనకు కల్పించలేదు. పాకిస్తాన్ సైనిక చట్టం కింద ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ ద్వారా జాదవ్ కేసు విచారణ జరిగింది. ఎప్పుడైతే పాక్ సైనిక కోర్టు తీర్పు వెలువడిందో భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ వెంటనే పాకిస్తాన్ హై కమిషనర్ బాసిత్‌ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేశారు. ఎలాంటి బలమైన ఆధారాలు లేకుండా జాదవ్‌కు మరణశిక్ష ఖరారు చేశారని, మొత్తం విచారణ హాస్యాస్పద రీతిలో జరిగిందని స్పష్టం చేశారు. జాదవ్‌ను గత ఏడాది ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని, అసలు అతడు పాకిస్తాన్‌కు ఎలా చేరుకున్నాడన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉందని జైశంకర్ అన్నారు. ఇరాన్ నుంచి ప్రవేశించిన జాదవ్‌ను గత ఏడాది మార్చి 3న తమ భద్రతా దళాలు బలూచిస్తాన్‌లో అరెస్టు చేశారని పాకిస్తాన్ చెబుతోంది. తన నేరాన్ని జాదవ్ ఒప్పుకున్నట్టుగా కూడా పాకిస్తాన్ ఓ వీడియోనూ విడుదల చేసింది. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం తన వాదనను వినిపించే అవకాశాన్ని జాదవ్‌కు ఇవ్వాలని అనేక మార్లు పాకిస్తాన్‌ను కోరినట్టు తన భారత్ స్పష్టం చేసింది. 2016 మార్చి 25నుంచి 2017 మార్చి 31 వరకూ దాదాపు 13సార్లు పాకిస్తాన్‌ను ఈ మేరకు అభ్యర్ధించడం జరిగిందని తెలిపింది. కానీ పాకిస్తాన్ అధికారులు ఇందుకు ఎంత మాత్రం అంగీకరించలేదని కూడా వివరించింది. అసలు జాదవ్‌ను విచారిస్తున్నామన్న విషయాన్ని కూడా పాక్‌లోని భారత హై కమిషన్‌కు తెలియజేయలేదని తెలిపింది.
భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధించడాన్ని అంతర్జాతీయ ప్రమాణాలను తుంగలో తొక్కడంగా అమ్మెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా స్పందించింది. ఓ రహస్య కోర్టు మరణ శిక్ష విధించడం విడ్డూరంగా ఉందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దక్షిణాసియా డైరెక్టర్ బీరజ్ పట్నాయక్ అన్నారు.
కుట్రదారులకు హెచ్చరిక:పాక్
ఇదిలా ఉండగా జాదవ్‌కు విధించిన మరణ శిక్ష తమ దేశానికి వ్యతిరేకంగా కుట్ర పనే్న వారికి ఓ తీవ్ర హెచ్చరిక అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. తమ దేశంపై ఎవరు కుట్ర పన్నినా సహించేది లేదని ఉద్ఘాటించారు.