అంతర్జాతీయం

మేం దేనికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: పాకిస్తాన్ అన్ని దేశాలతోను ముఖ్యంగా తన పొరుగు దఏశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం అన్నారు. భారతీయుడు కులభూషణ్ జాదవ్‌ను ఉరి తీయాలని పాక్ మిలిటరీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమైన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎలాంటి ముప్పులకైనా తగిన విధంగా స్పందించగల సమర్థత పాక్ సాయుధ బలగాలకు ఉందని కూడా ఆయన చెప్పారు. దేశ సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని ఆయన చెప్తూ, ఆధునిక కాలపు సవాళ్లను ఎదుర్కోవడంలో సైన్యం సర్వసన్నద్ధమై ఉండేలా చూసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారమందిస్తుందని చెప్పారు. దేశ భద్రతకు అర్థం పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు దేశ భద్రత అనేది కేవలం సాయుధ బలగాలకే పరిమితమైనది కాదని షరీఫ్ చెప్పినట్లు పాకిస్తాన్ రేడియో తెలియజేసింది.గూఢచర్యం ఆరోపణలపై భారతీయ పౌరుడు కులభూషణ్ జాదవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించిన ఒక రోజు తర్వాత షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ చర్యపై తీవ్రంగా స్పందించిన మన దేశం పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి ఇది ముందుగా నిర్ణయించుకున్న హత్య అంటూ నిరసన తెలిపింది కూడా. మంగళవారం ఖైబర్-్ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని అస్గర్‌ఖాన్‌లో పాకిస్తాన్ వైమానిక దళ శిక్షణా సంస్థ(పిఏఎఫ్)లో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల పాసింగ్‌ఔట్ పరేడ్‌నుద్దేశించి షరీఫ్ మాట్లాడుతూ, ఘర్షణ కన్నా సహకారం, ఒకరినొకరు అనుమానంగా చూడడంకన్నా, ఎదుటివారు ఎదగాలన్న ఆకాంక్షను కలిగి ఉండడం పాకిస్తాన్ విధానం ముఖ్య సిద్ధాంతమని అన్నారు. పాకిస్తాన్ శాంతికాముక దేశమని, అన్ని దేశాలతో ముఖ్యంగా తన పొరుగుదేశాలతో మైత్రీపూర్వక సంబంధాలను కలిగి ఉండాలనేది పాకిస్తాన్ విధానమని ఆయన చెప్పారు.