అంతర్జాతీయం

మలాలాకు ఐరాస శాంతిదూత బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, ఏప్రిల్ 11: ‘మహిళల రెక్కలను పురుషులు కట్టిపడేయొద్దు. వారిని స్వేచ్ఛగా ఎగరనిద్దాం’ అంటూ బాలల హక్కుల ఉద్యమ కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ పిలుపునిచ్చారు. బాలల విద్య కోసం అవిరళ పోరాటం చేస్తున్న మలాలాకు ఐరాస శాంతిదూత బహుమతి ప్రకటించింది. ఆమె ఈ అవార్డులు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతుల మీదుగా మంగళవారం అందుకున్నారు. మహిళ జీవితంలో పురుషులు, తండ్రులు, సోదరుల పాత్ర చాలా కీలకం అని 19 ఏళ్ల మలాలా అన్నారు. పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో తనలాంటి అమ్మాయిలు ఎందరో ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. అయితే తండ్రులు వారికి అవకాశం ఇవ్వకపోవడంతో తమ భావానలను అణచివేసుకుంటున్నారని నోబెల్ అవార్డు గ్రహీత ఆవేదన వ్యక్తం చేశారు.‘నాకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. నా తండ్రి ప్రోత్సహించారు. కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. కాబట్టే స్వేచ్ఛగా భావాలు పంచుకుంటున్నాను’అని ఆమె ప్రకటించారు. పురుషులు, తండ్రులు బాలికలపై ఆంక్షలు పెట్టొదని, వారికి స్వేచ్చగా ఉండనీయండని మలాల పిలుపునిచ్చారు.