అంతర్జాతీయం

రాజీ సమస్యే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 13: భారతీయుడయిన కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్ష విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని పాకిస్తాన్‌కు చెందిన ఉన్నత స్థాయి మిలిటరీ జనరల్‌లు గురువారం నిర్ణయించారు.
కుల్‌భూషణ్ జాదవ్‌ను ఉరి తీస్తే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని భారత్ హెచ్చరించినప్పటికీ, పాకిస్తాన్ సైనిక జనరల్‌లు మాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా అధ్యక్షతన రావల్పిండిలోని జనరల్ కార్యాలయంలో జరిగిన కాప్స్ కమాండర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మిలిటరీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సమావేశంలో జనరల్‌లకు జాదవ్ గురించిన వివరాలు తెలియజేయడం జరిగిందని, అయి తే దేశ వ్యతిరేక కార్యకలాపాల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని సమావేశంలో నిర్ణయించడం జరిగిందని ఐఎస్‌పిఆర్ వివరించింది.