అంతర్జాతీయం

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో.. అమెరికా భద్రతకు భారతే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 13: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన భద్రతకు భారత్ కీలకమైన దేశమని అమెరికా భావిస్తోందని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా ఇటీవల భారత్‌కు ఇచ్చిన ‘ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదాను అమలు చేయడానికి ఉద్దేశించిన ప్రక్రియను ట్రంప్ పాలనాయంత్రాంగం ప్రారంభించిందని పెంటగాన్ పేర్కొంది. భారత్, అమెరికా మధ్య సంబంధాలు సజావుగా సాగుతున్నాయని, రక్షణ మంత్రి జేమ్స్ మట్టిస్ భారత్‌తో రక్షణ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పెంటగాన్ అధికార ప్రతినిధి క్యాప్టెన్ జెఫ్ డేవిస్ ఒక వార్తాసంస్థకు తెలిపారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్తులో అమెరికా భద్రతకు భారత్‌ను కీలకమైన దేశంగా జేమ్స్ భావిస్తున్నారని డేవిస్ చెప్పారు. జేమ్స్ మట్టిస్ పెంటగాన్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కె దోవల్‌తో జరిపిన సమావేశం విజయవంతమైన కొన్ని వారాల తరువాత డేవిస్ ఈ విషయం చెప్పారు.
మీడియా కథనాల ప్రకారం, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ ఆర్ మెక్‌మాస్టర్ త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు. అయితే వైట్ హౌస్ ఈ పర్యటన గురించి ప్రస్తావించలేదు. భారత్- అమెరికా సంబంధాలలో రక్షణ బంధానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్న ట్రంప్ పాలనా యంత్రాంగం.. భారత్‌కు ఇచ్చిన ‘మేజర్ డిఫెన్స్ పార్టనర్’ హోదాను అమలు చేసే ప్రక్రియను ప్రారంభించింది. మట్టిస్ అప్పటి భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో జరిపిన తొలి ఫోన్ సంభాషణలో తనకన్నా ముందున్న అమెరికా రక్షణ మంత్రి అశ్‌టోన్ కార్టర్ హయాంలో భారత్- అమెరికా రక్షణ బంధం ఎక్కడి వరకు సాగిందో, అక్కడి నుంచి ముందుకు తీసికెళ్తానని హామీ ఇచ్చినట్లు భావిస్తున్నారు. అంటే భారత్‌కు ఇచ్చిన ‘ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదాను వేగంగా అమలు చేయడమే ఈ హామీ ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, తాము అగ్ర ప్రాధాన్యత ఇస్తున్న ప్రపంచ విషయాలలో భారత్‌తో తమ రక్షణ బంధం ఒకటని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.