అంతర్జాతీయం

నాటో మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 13: నాటో విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. నాటో ఇంకెంత మాత్రం గతం మాత్రమే కాదని పేర్కొన్నారు. సిరియా విషయంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్ సైనిక కూటమి నాటో పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. నాటో కూటమి పనితీరు పట్ల తాను అసంతృప్తి వ్యక్తం చేసింది చాలా కాలం క్రితమని, ఇప్పుడు వారు మారారని, ఇప్పుడు వారు ఉగ్రవాదంతో పోరాడుతారని ట్రంప్ వైట్ హౌస్‌లో నాటో సెక్రెటరి జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బెర్గ్‌తో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో అన్నారు. ఇరాక్‌లో ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తమ ఇరాక్ భాగస్వాములకు మద్దతుగా పెరిగిన బాధ్యతలను నాటో స్వీకరిస్తుందని తాను విశ్వసిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
1949లో ఏర్పాటయిన నాటో కూటమి ప్రస్తుత ఆవశ్యకతను ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తరచుగా ప్రశ్నించారు. రష్యా ప్రస్తావన తీసుకొస్తూ దానితో మైత్రీబంధానికి మొగ్గు చూపారు. అయితే సిరియా అంశం వల్ల రష్యాతో అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారిన విషయాన్ని ట్రంప్ గుర్తించారు. ఇప్పటి నుంచి తాము ఇంకెంత మాత్రం రష్యాతో కలిసి సాగలేమని ట్రంప్ బుధవారం పేర్కొన్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మద్దతిచ్చిన రష్యాపై ట్రంప్ పాలనా యంత్రాంగం విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోంటెనీగ్రో ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని కూడా ట్రంప్ పాలనా యంత్రాంగం ప్రశ్నించింది. ట్రంప్ అంతకు ముందు అసద్‌ను కసాయి అని అభివర్ణించారు. సిరియాలో కిరాతక అంతర్యుద్ధాన్ని ముగించడానికి ఇదే తగిన సమయమని ఆయన తన మిత్ర పక్షాలకు చెప్పారు. 28 సభ్య దేశాలతో కూడిన నాటో కూటమిలో మోంటెనీగ్రో చేరికకు ట్రంప్ మద్దతిచ్చారు. నాటో కూటమిలో 29వ దేశంగా మోంటెనీగ్రో చేరికను ఆమోదించేందుకు దాని ప్రొటోకాల్‌పై ట్రంప్ సోమవారం సంతకం చేశారు.

చిత్రం..వైట్ హౌస్‌లో నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బెర్గ్‌తో కరచాలనం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ డ ట్రంప్