అంతర్జాతీయం

అది రష్యా అండతో పనిచేస్తున్న శత్రు గూఢచార సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 14: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రముఖుల రహస్యాలను బట్టబయలు చేస్తున్న ప్రముఖ విజిల్ బ్లోవర్ (వేగు సంస్థ) వికీలీక్స్‌పై అమెరికా గూఢచార సంస్థ సిఐఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) కొత్త డైరెక్టర్ మైక్ పోంపెయో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాకు చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేసి తమ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన వికీలీక్స్ రష్యా అండ దండలతో పనిచేస్తోందని ఆయన ఆరోపించడంతో పాటు ఆ సంస్థను ప్రభుత్వేతర శత్రు గూఢచార సంస్థగా అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆర్‌టి టెలివిజన్ నెట్‌వర్క్ వికీలీక్స్ వెబ్‌సైట్‌తో కలసి పనిచేస్తున్నట్లు సిఐఎ గుర్తించిందని ఆయన చెప్పారు.