అంతర్జాతీయం

ఏ క్షణంలోనైనా యుద్దం రావచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 14: ఉత్తర కొరియాపై ఏ క్షణంలోనైనా యుద్ధం సంభవించవచ్చని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ రుూ హెచ్చరించారు. అంతేకాదు, ఏ యుద్ధంలోనైనా విజేత అనే వారు ఉండరని కూడా ఆయన అంటూ, చర్చలు ఒక్కటే సమస్యకు పరిష్కారమని చెప్పారు. అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాంగ్ రుూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజింగ్‌లో శుక్రవారం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-మార్క్ అయ్‌రాల్ట్‌తో చర్చల అనంతరం ఆయనతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మరోఅణు పరీక్ష జరపవద్దని తన మిత్రదేశమైన ఉత్తరకొరియాను ఆయన హెచ్చరిస్తూ, అలాంటి ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన చర్య యుద్ధానికి దారి తీయవచ్చని హితవు చెప్పారు. అమెరికా, ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితి మనందరికీ ఆందోళన కలిగించే అంశమని ఉత్తరకొరియా గనుక అణు పరీక్షకు దిగితే తీవ్రమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను నేరుగా ప్రస్తావించకుండా వాంగ్ అన్నారు. కొరియా ప్రాంతంపై పరిస్థితి చేయిదాటిపోయేలా చేసే ఎలాంటి బాధ్యతారహితమైన ప్రకటనలు, పనులు చేయవద్దని సంబంధిత పక్షాలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నామని వాంగ్ చెప్పారు. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అన్ని రకాల అణు, క్షిపణి సంబంధిత కార్యకలాపాలను నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చాలా స్పష్టంగా పేర్కొంటోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. ఉత్తర కొరియా మరో అణు పరీక్ష జరపడానికి సిద్ధమవుతోందంటూ వస్తున్న వార్తల గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఒక వేళ ఉత్తర కొరియా అణు పరీక్ష జరిపితే అది అత్యంత ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన చర్య అవుతుందని కూడా ఆయన అన్నారు. కాగా, వచ్చే సోమవారంనుంచి బీజింగ్, ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌ల మధ్య ఎయిర్‌చైనా విమాన సర్వీసులను నిపివేయనున్నట్లు చైనా అధికార టీవీ చానల్ సిసిటీవీ శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలియజేసింది. శనివారం ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్-2 సంగ్ 105 జయంతి సందర్భంగా ఆ దేశ అణ్వస్త్ర పరీక్ష కేంద్రం వద్ద కార్యకలాపాలు జోరందుకున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్త రావడం విశేషం.