అంతర్జాతీయం

ఐసిస్‌కు చావుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఏప్రిల్ 14: ఇటీవలి కాలంలో వరసగా ఎదురుదెబ్బలు తింటున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు మరో చావుదెబ్బ తగిలింది. అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా జరిపిన అతి పెద్ద బాంబు దాడిలో 36 మంది మిలిటెంట్లు చనిపోయారు. ఈ దాడిలో మిలిటెంట్లకు చెందిన మందుగుండు, ఆయుధాలు కూడా భారీ మొత్తంలో ధ్వంసమైనట్లు అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహమ్మద్ రాడ్‌మనిష్ చెప్పినట్లు ‘ఎఫె న్యూస్’ తెలిపింది. అయితే ఈ దాడిలో సామాన్య పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదంతో గురువారం రాత్రి నంగర్హార్ రాష్ట్రంలోని అచిన్ జిల్లాలో ఉగ్రవాదులు ఉపయోగించే గుహలు, సొరంగాల సముదాయంపై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా పిలిచే దాదాపు 11 టన్నుల టిఎంటి శక్తిని విడుదల చేయగల అత్యంత శక్తిమంతమైన జిబియు-43 బాంబును జార విడిచినట్లుతెలుస్తోంది. అమెరికా సైన్యంలోనే అతి పెద్ద నాన్ న్యూక్లియర్ బాంబు అయిన ఈ బాంబు దాడిలో ఐఎస్ గ్రూపునకు చెందిన టనె్నల్ సముదాయం పూర్తిగా నేలమట్టమయిందని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, ఎంసి-130 రవాణా విమానం ద్వారా పంపిన ఈ బాంబు అచిన్ జిల్లాలోని మహమ్మద్ డారా ప్రాంతంలో పడినట్లు అచిన్ జిల్లా గవర్నర్ ఇస్మాయిల్ షిన్వారి చెప్పారు. ఈ దాడి చాలా విజయవంతమయిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. కాగా,పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా చూడడానికి అన్ని మందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అఫ్గాన్ అధ్యక్ష భవనం తెలియజేసింది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న నంగన్హార్ ప్రాంతంలోని జిహాదీ స్థావరాలపై అమెరికా గత ఏడాది ఆగస్టులో సైతం వైమానిక దాడులు జరిపింది.

చిత్రం..యుఎస్ దళాలు బాంబు దాడి జరిపిన ప్రదేశంలో అప్రమత్తమైన ఆఫ్గాన్ భద్రతా బలగాలు