అంతర్జాతీయం

అంబేద్కరే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్ 14: సామాజిక న్యాయం, సమానత్వం కోసం జరిపే పోరాటంలో సంఘ సంస్కర్త, దళిత నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా అహ్మద్ సభ్య ఐరాస సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అన్ని వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం డిజిటల్ టెక్నాలజీ శక్తిని ఉపయోగించుకోవాలని కూడా ఆమె కోరారు. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఇప్పుడు శరవేగంగా మార్పు చెందే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీల యుగం లో ఉన్నాయని, నిలకడయిన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి మన కు తోడ్పడే శక్తి వాటికి ఉందని అ న్నారు. అందువల్ల అన్ని ప్రాంతా ల్లో సమాజాల అభివృద్ధికి ఈ టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని ఆమె అన్నారు. మహిళలు, మైనారిటీలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ ప్రయత్నాలను స్వాగతిస్తారని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆమె చెప్పారు.