అంతర్జాతీయం

జాదవ్ ఉగ్రవాదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 16: భారత్‌లో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నప్పటికీ, మోదీ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించినప్పటికీ గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారతీయ ఖైదీ కులభూషణ్ జాదవ్‌ను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నాలను పాక్ మానుకోవడం లేదు. ఆయన మిలిటెంట్ కార్యకలాపాలపై పాకిస్తాన్ కొత్తగా ఒక నివేదికను రూపొందించిందని, ఆ నివేదికను ఐక్యరాజ్య సమితికి, ఇస్లామాబాద్‌లో ఉంటున్న విదేశీ దౌత్యవేత్తలకు చూపిస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కరాచి, బలూచిస్థాన్ ప్రాంతాల్లో గూఢచర్యం, మిలిటెంట్ కార్యకలాపాలకు పాల్పడ్డం గురించి ఫీల్డ్ జనరల్ కోర్టుమార్షల్ (సైనిక న్యాయస్థానం) ముందు జాదవ్ ఇంతకుముందు ఇచ్చిన వాంగ్మూలాలు, స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ కొత్త నివేదికను రూపొందించినట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి. కోర్టుమార్షల్ జనరల్ నివేదికతో పాటుగా కోర్టు విచారణ కాలక్రమం కూడా ఈ నివేదికలో ఉంటాయని ‘ది నేషన్’ దినపత్రిక తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీ చట్టం కింద ఫీల్డ్ జనరల్
కోర్టుమార్షల్ ద్వారా 46 ఏళ్ల జాదవ్‌పై విచారణ జరిపి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా గత వారం జాదవ్ మరణ శిక్షను ధ్రువీకరించారు కూడా. జాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పాక్ భద్రతా దళాలు జరిపిన అరెస్టులు, దాడుల వివరాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది. ఇస్లామాబాద్‌లోని వివిధ దేశాల దౌత్యవేత్తలకు ఈ నివేదికను అందజేయడం జరుగుతుంది. అలాగే వివిధ దేశాల్లోని పాక్ దౌత్యవేత్తలు ఆయా దేశాలకు కూడా ఈ నివేదికను ఇస్తారు. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు కూడా ఈ నివేదికను అందజేస్తారని ఆ పత్రిక తెలిపింది. జాదవ్‌కు విధించిన మరణశిక్షపై అపీలు చేస్తామని పాక్‌లో భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలే శుక్రవారం చెప్పడమే కాకుండా ఈ కేసులో జాదవ్‌పై దాఖలు చేసిన చార్జిషీట్, కోర్టు ఉత్తర్వుల కాపీలను ఇవ్వాలని పాక్‌ను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.