అంతర్జాతీయం

తుస్సుమన్న ఉత్తర కొరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 16: ఉత్తర కొరియా ఆదివారం ఒక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమైందని, ప్రయోగించిన కొద్దిసేపటికే ఆ క్షిపణి పేలిపోయిందని అమెరికా సైనిక దళం వెల్లడించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం శనివారం భారీ సైనిక పరేడ్ నిర్వహించి తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించిన మరుసటి రోజే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమైందని, అయితే ఇది ఏ తరహా క్షిపణి అన్నది ఇంకా తెలియరాలేదని అమెరికా పసిఫిక్ కమాండ్ (యుఎస్‌పిఎసిఓఎం) ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర కొరియా తూర్పు తీర నగరమైన సిన్పో సమీపం నుంచి ప్రయోగించిన ఈ బాలిస్టిక్ క్షిపణిని తాము గుర్తించి, దానిని ఉత్తర కొరియాకు చెందిన క్షిపణిగా నిర్ధారించామని అమెరికా పసిఫిక్ కమాండ్ అధికార ప్రతినిధి సిడిఆర్ డేవ్ బెన్హామ్ తెలిపారు.