అంతర్జాతీయం

అధ్యక్షుడి అధికారాలపై టర్కీలో రెఫరెండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్ ఏప్రిల్ 16: అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ నేతృత్వంలో ప్రభుత్వాధినేతకు విశేషాధికారాలు కల్పించే అంశంపై టర్కీలో ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. రాత్రి చివరి వార్తలందే సమయానికి 25 శాతం బ్యాలెట్ పెట్టెలను లెక్కించే సరికి అనుకూలంగా 63.2 శాతం ఓటర్లు మొగ్గు చూపగా, వ్యతిరేకంగా 36.8 శాతమే మద్దతులభించినట్లు ఎన్‌టీవీ చానల్ తెలిపింది. ఈ రెఫరెండం ఫలితంపైనే టర్కీ భవిష్యత్తు సైతం ఆధారపడి ఉంది. 5.53 కోట్ల మందికిపైగా ప్రజలు ఈ రెఫరెండంలో పాల్గొనబోతున్నారు. ఒకవేళ దేశ ప్రజలు గనుక విస్తృతాధికారాలకు అనుకూలంగా ఓటు వేసినట్లయితే ఇప్పటివరకు ఏ దేశాధ్యక్షుడికీ లేని విస్తృతాధికారాలు ఎర్డోగన్‌కు దక్కుతాయి. ఒకవేళ దేశ ప్రజలు గనుక విస్తృతాధికారాలకు అనుకూలంగా ఓటువేస్తే టర్కీలో కొత్త అధ్యక్ష తరహా పాలన మొదలై ప్రధానమంత్రి పదవి రద్దయిపోతుంది. మంత్రులను నియమించే అధికారం కూడా అధ్యక్షుడికే ఉంటుంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2019 నవంబర్ ఎన్నికల తర్వాత ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తుంది.