అంతర్జాతీయం

సంతానంకోసం వెళ్తే.. పిడుగులాంటి వార్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 16: అమెరికాలో ఒక వివాహిత జంటకు పిడుగు లాంటి వార్త ఎదురైంది. సహజ సిద్ధంగా గర్భాన్ని ధరించడంలో వీరికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సాధారణ డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించగా ఆ దంపతులిద్దరూ ఒకే తల్లితండ్రులకు పుట్టిన కవల పిల్లలని తేలింది. దీంతో వారు నిర్ఘాంతపోయారు. సంతానం కోసం పరితపిస్తున్న ఈ జంట సహాయంకోసం మిస్సిసిపీ రాష్ట్రంలోని జాక్సన్‌లో గల ఐవిఎఫ్ క్లినిక్‌ను ఆశ్రయించడంతో ఈ విషయం వెల్లడయింది.
వీరినుంచి సేకరించిన డిఎన్‌ఎ శాంపిళ్లను పరీక్షించగా, రెండింటి మధ్య ఎంతో సారూప్యత కనిపించిందని, ఫైళ్లలో వీరి పుట్టిన తేదీలు కూడా ఒకే విధంగా ఉండటంతో దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలన జరపగా, ఈ దంపతులు కవల పిల్లలని తేలిందని వైద్యుడు వెల్లడించాడు. ఎన్నో ఏళ్ల క్రితం తల్లిదండ్రులు కారు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో చిన్నతనంలోనే అనాథలైన వీరిని ప్రభుత్వ సంరక్షణా కేంద్రానికి తరలించగా, వేర్వేరు కుటుంబాలు వీరిని దత్తత్త తీసుకున్నాయని, అయితే వీరు కవల పిల్లలన్న విషయం ఆయా కుటుంబాలకు కూడా తెలియదని ఆ వైద్యుడు వివరించాడు. గర్భధారణ విషయంలో ఎంతోమంది దంపతుల సమస్యలను పరిష్కరించి వారికి సంతాన భాగ్యాన్ని కల్పించిన తనకు కెరీర్‌లోనే ఇది ఎంతో అసాధారణమైన కేసు అని, సహాయం చేయడంలో తాను విఫలమైన మొదటి కేసు కూడా ఇదేనని ఆ వైద్యుడు తెలిపాడు.