అంతర్జాతీయం

సిరియా పేలుళ్లలో 126కు పెరిగిన మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరూట్, ఏప్రిల్ 16: సిరియన్లను తరలిస్తున్న బస్సులపై శనివారం జరిగిన కారుబాంబు దాడిలో మృతుల సంఖ్య 126కు చేరుకుందని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. మృతుల్లో 68 మంది చిన్నారులున్నారని కూడా ఆ సంస్థ తెలిపింది. కాగా, కారు బాంబు పేలుడులో వందలాది మంది గాయపడిన దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా ఆ సంస్థ తెలిపింది. ప్రభుత్వం తిరుగుబాటుదారుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా సిరియా ఉత్తరప్రాంతంలోని ఫువా, కఫ్రయా పట్టణాలకు చెందిన ప్రజలను అలెప్పో నగరానికి బస్సులలో తరలిస్తూ ఉండగా పేలుడు పదార్థాలు నింపిన కారుతో వాటిపై దాడి చేశారు. రెండేళ్లకు పైగా ఈ రెండు పట్టణాలు తిరుగుబాటుదారుల స్వాధీనంలో ఉన్నాయి.