అంతర్జాతీయం

‘టైమ్’ప్రభావ శీలుర జాబితాలో మోదీ, పేటిఎం శర్మకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 20: ‘టైమ్’ పత్రిక ప్రతి ఏటా ప్రచురించే వందమంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మన దేశంనుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటిఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మలకు స్థానం లభించింది. టైమ్ మ్యాగజైన్ గురువారం ఈ జాబితాను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని థెరెసా మే తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం పొందుతారా లేదా అనే విషయం తేలకముందే నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌కు ప్రధాని అయ్యారని మోదీ గురించి రచయిత పంకజ్ మిశ్రా రాసిన ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత కూడా ఆయన పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని, ప్రజలను సమ్మోహితులను చేస్తూనే ఉన్నారని మ్యాగజైన్ పేర్కొంది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బిజెపి సాధించిన ఘన విజయాన్ని కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఇక పేటిఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ భారత దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్నారని పేర్కొంది. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం హటాత్తుగా వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు శర్మ ఆ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకున్నారని తెలిపింది. 2016 ప్రారంభం నాటికి పేటిఎంకు 12.2 కోట్ల మంది యూజర్లు ఉంటే ఏడాది చివరి నాటికి 17.7 కోట్లకు పెరిగారని తెలిపింది. చిన్న పల్లెటూరినుంచి వచ్చి, హిందీ మీడియంలో చదువుకున్న శర్మ దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని శర్మ గురించిన ప్రొఫైల్‌ను రాశారు. కళాకారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా అన్ని రంగాలకు చెందిన వారినుంచి అత్యంత ప్రభావ శీలురైన వందమందిని టైమ్ పత్రిక ప్రతి ఏటా ఎంపిక చేసి జాబితాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

చిత్రాలు..నరేంద్ర మోదీ * విజయ్ శేఖర్ శర్మ