అంతర్జాతీయం

అమెరికా ఆర్థికాభివృద్ధిలో భారత నిపుణులదే కీలకపాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 21: అమెరికాలో హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్ సర్కారు నిర్ణయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం పట్ల భారత్‌కు గల అభ్యంతరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్స్ రాస్‌కు వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత వృత్తి నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని జైట్లీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ దేశంలో హెచ్-1బి వీసాల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు అత్యంత నిపుణులైన వారికి మాత్రమే ఈ వీసాలు ఇచ్చే లా చూసేందుకు నిబంధనలను కఠినతరం చేయాలన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం సంతకం చేసిన విషయం విదితమే. దీంతో భారత ఐటి పరిశ్రమకు దాదాపు 150 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుండటంతో అమెరికా నిర్ణయం పట్ల జైట్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థికాభివృద్ధిలో భారత వృత్తి నిపుణులు ముఖ్యమైన భూమికను పోషిస్తున్న విషయాన్ని జైట్లీ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, అమెరికా ప్రభు త్వం ఇకమీదట ఏ నిర్ణయం తీసుకునే ముందై నా ఈ అంశాన్ని గమనంలో ఉంచుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాలపై సమీక్ష మాత్రమే జరుపుతోందని, అంతేతప్ప వాటి నిబంధనల విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని జైట్లీకి రాస్ వివరించినట్లు తెలుస్తోంది.