అంతర్జాతీయం

అమెరికాతో గట్టి చెలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 22: భారత్, అమెరికా సంబంధాలు ఎంతో పరిపక్వమైనవని, ఇరు దేశాల్లో ప్రభుత్వాలు మారినా ఎన్నో దశాబ్దాల నుంచి అవి బలపడుతూనే ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ, అమెరికాతో ద్వైపాక్షి సంబందాలను మరింత బలోపేతం చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం ఎదురు చూస్తోందన్నారు. భారత్, అమెరికా సంబంధాలకు ఇరు దేశాల్లో విస్తృతమైన మద్దతు ఉందని, ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వంతో కలసి పనిచేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నామని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న అరుణ్ జైట్లీ శుక్రవారం ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి విల్‌బర్స్ రాస్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య మంత్రుల స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. ‘్భరత్, అమెరికా సంబంధాలు ఎంతో బలమైనవి, పరిపక్వమైనవి. గత కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ సంబంధాలు నిరంతరం బలపడుతూనే ఉన్నాయి. శుక్రవారం అమెరికా వాణిజ్య శాఖ మంత్రితో సమావేశమైన నేను ఆదివారం ట్రంప్ ప్రధాన ఆర్థిక సలహాదారుతో భేటీ కాబోతున్నా. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య మంత్రుల స్థాయి సమావేశాలు జరగడం ఇదే మొదటిసారి’ అని జైట్లీ వివరించారు.