అంతర్జాతీయం

మరో భారతీయుడికి ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవినుంచి భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తిని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. తన వాళ్లను ఆ పదవిలో నియమించుకోవడానికి ట్రంప్ వివేక్ మూర్తిని ఆ పదవినుంచి తప్పించారు. 39 ఏళ్ల వివేక్ మూర్తిని నాలుగేళ్ల కాలానికి ఒబామా ప్రభుత్వం సర్జన్ జనరల్‌గా నియమించింది. ప్రస్తుతం డిప్యూటీ సర్జన్ జనరల్‌గా ఉన్న రేర్ అడ్మిరల్ సిల్వియా ట్రెంట్- ఆదమ్స్‌ను వివేక్ మూర్తి స్థానంలో సర్జన్ జనరల్‌గా నియమించారు.
వివేక్ మూర్తిని విధులనుంచి ఎందుకు తప్పించారో స్పష్టంగా తెలియదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అంటూ, ఆరోగ్య, మానవ సేవల విభాగంలో ఉద్యోగులు మాత్రం ఆయనను హఠాత్తుగా తప్పించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిపింది. కాగా, ఇన్నాళ్లపాటు ఇంత ప్రతిష్ఠాత్మకమైన పదవిలో కొనసాగడం తనకు గౌరవం, గర్వకారణమని వివేక్ మూర్తి ఫేస్‌బుక్ పోస్టింగ్‌లో పేర్కొన్నారు. అమెరికాలాంటి పెద్ద దేశం మొత్తానికి ఆరోగ్య విషయాలు చూసుకోవలసిందిగా అధ్యక్షుడు అడిగే స్థాయికి ఎదగడం భారతదేశంలోని ఓ పేద రైతు మనవడికి గర్వకారణమని, 40ఏళ్ల క్రితం వలసవచ్చిన తన కుటుంబాన్ని స్వాగతించినందుకు, దేశానికి సేవ చేసే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుడినని ఆయన ఆ పోస్టింగ్‌లో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పదవులనుంచి తొలగించిన భారతీయ సంతతి వారిలో వివేక్ మూర్తి రెండో వ్యక్తి. అంతకుముందు న్యూయార్క్‌కు చెందిన అటార్నీ జనరల్ ప్రీత్ బరారాను తీసేసారు. ఆయన రాజీనామా చేయడానికి నిరాకరించడంతో బలవంతంగా తప్పించారు. వివేక్ మూర్తి తల్లిదండ్రులు కర్నాటకకు చెందినవారు. బ్రిటన్‌లోని హడ్డర్స్‌ఫీల్డ్‌లో ఆయన జన్మించారు. వివేక్ మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన కుటుంబం అమెరికాలోని మయామికి వలస వచ్చింది. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌నుంచి ఎండి డిగ్రీ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్‌నుంచి హెల్త్‌కేర్ మేనేజిమెంట్‌లో ఎంబిఏ డిగ్రీలు పొందిన ఆయన ప్రస్తుతం బోస్టన్‌లోని బ్రిఘమ్ అండ్ ఉమెన్స్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు.

చిత్రం..వివేక్ మూర్తి