అంతర్జాతీయం

మళ్లీ దర్యాప్తు సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఏప్రిల్ 27: ముంబయిపై ఉగ్రవాద దాడి కేసును తిరిగి దర్యాప్తు చేయడం సాధ్యం కాదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, ఈ దశలో మళ్లీ దర్యాప్తు ప్రారంభించడం సాధ్యం కాదని పేర్కొంది. 26/11 దాడి కుట్రదారు, జమాత్ ఉద్ దావా (జెయుడి) చీఫ్ హఫీజ్ సరుూద్‌కు వ్యతిరేకంగా నిర్దిష్టమైన ఆధారాలను తమకు సమర్పించాలని డిమాండ్ చేసింది. 2008లో జరిగిన ఈ దాడి కేసును తిరిగి దర్యాప్తు చేయాలని, హఫీజ్ సరుూద్‌ను ఈ కేసులో విచారించాలని భారత్ చేసిన డిమాండ్‌కు పాకిస్తాన్ పైవిధంగా స్పందించింది. ‘ఈ కేసులో అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. కేవలం 24మంది భారత సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయవలసి ఉంది. ఈ దశలో కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించడం సాధ్యంకాదు. భారత్ ఈ కేసు విచారణను ముగించాలని కోరుకుంటే, తన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడానికి వారిని పాకిస్తాన్‌కు పంపించాలి’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు. 26/11 కేసులో సరుూద్‌ను విచారించాలంటే అతనికి వ్యతిరేకంగా పటిష్ఠమైన ఆధారాలను ఇవ్వాలని పాకిస్తాన్ కోరుతోందని ఆ అధికారి తెలిపారు. ముంబయిపై దాడి సందర్భంగా సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఒకసారి హఫీజ్ సరుూద్‌ను కలిశానని చెప్పినట్టు భారత్ తన పత్రాల్లో పేర్కొందని, అయితే సరుూద్‌ను వేలాదిమంది కలుస్తుంటారని, అందువల్ల అది దేనినీ రుజువు చేయజాలదని పాకిస్తాన్ బదులిచ్చినట్టు ఆ అధికారి వెల్లడించారు. భారత్ గట్టి ఆధారాలు సమర్పిస్తే పాకిస్తాన్ ఈ కేసులో సరుూద్‌ను విచారిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే దాడితో సరుూద్‌కు సంబంధం ఉన్నట్టు తగిన ఆధారాలను ఇప్పటికే పాకిస్తాన్‌కు అందజేసినట్టు భారత్ పేర్కొంటోంది. ముంబయిపై దాడి జరిగిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం సరుూద్‌ను గృహనిర్బంధంలో ఉంచింది. అయితే అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ 2009లో కోర్టు అతనికి గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించింది.
పారదర్శకంగానే జాదవ్ కేసు విచారణ
ఇస్లామాబాద్: కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ తన వైఖరిని గురువారం పునరుద్ఘాటించింది. గూఢచర్యానికి, విద్రోహ కార్యకలాపాలకు పాల్పడిన జాదవ్‌ను పాకిస్తాన్ చట్టాల ప్రకారం విచారించిన సైనిక కోర్టు నిర్దిష్టమైన ఆధారాల ప్రాతిపదికన తీర్పు ఇచ్చిందని, ఈ కేసు విచారణ పారదర్శకంగా సాగిందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా పేర్కొన్నారు.

చిత్రాలు..ముంబయలో జరిగిన 26/11 మారణకాండకు సజీవ సాక్ష్యాలు ఈ దృశ్యాలు