అంతర్జాతీయం

వాయు కాలుష్యంతో గుండెకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 28: వాయు కాలుష్యం మనుషుల్లో గుండెపోటుకు దారితీస్తుందని నూతన అధ్యయనం హెచ్చరించింది. కలుషితమైన గాలిలోని సూక్ష్మ రేణువులు ఊపిరితిత్తుల గుండా రక్తప్రవాహంలో చేరి మనం గుండెపోటుకు గురయ్యే అవకాశాలను పెంచుతాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కలుషితమైన గాలిలోని సూక్ష్మ రేణువులకు, హృద్రోగాలకు సంబంధం ఉందని, అవి అకాల మరణాలకు దారితీస్తాయని బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ, నెదర్లాండ్స్ ప్రజారోగ్య, పర్యావరణ సంస్థ శాస్తవ్రేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. అయితే మనం పీల్చే గాలిలోని కలుషిత రేణువులు రక్తనాళాలతో పాటు గుండెకు ఏవిధంగా నష్టాన్ని కలిగిస్తాయన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా, 2012లో సంభవించిన అకాల మరణాల్లో 72 శాతం మంది వాయు కాలుష్యం వలన హృద్రోగాలకు గురై మృతిచెందగా, మరో 28 శాతం మంది వాయు కాలుష్యం వలన సంభవించిన ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులతో మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) అంచనా వేసింది.