అంతర్జాతీయం

పెరుగుతున్న ఉద్రిక్తతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఏప్రిల్ 30: అమెరికాతోపాటు దాని మిత్ర దేశమైన కొరియా భారీస్థాయిలో నిర్వహించిన వార్షిక సైనిక విన్యాసాలను ఆదివారం ముగించాయి. అయితే ఈ ఇరు దేశాలు ప్రత్యేకంగా సంయుక్త నావికాదళ విన్యాసాలను కొనసాగిస్తుండటంతో ఉత్తర కొరియా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొరియా ద్వీపకల్పంలో గత కొన్ని వారాల ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతుండటంతో సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్షను లేదా ఆరోసారి అణు పరీక్షను నిర్వహించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తర కొరియాపై సైనిక దాడి జరిపే అవకాశాలను తోసిపుచ్చేందుకు అమెరికా నిరాకరిస్తోంది. ‘్ఫల్ ఈగల్’ పేరుతో తాము అమెరికాతో కలసి నిర్వహించిన వార్షిక సైనిక విన్యాసాలు నిర్దేశిత షెడ్యూలు ప్రకారం ఆదివారంతో ముగిశాయని, తమ దేశానికి చెందిన 20 వేల మంది సైనికులతో పాటు 10 వేల మంది అమెరికా సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకుముందు ఈ ఇరు దేశాలు ‘కీ రిజాల్వ్’ పేరుతో నిర్వహించిన విన్యాసాలు గత నెలలో ముగిసిన విషయం విదితమే. ఉత్తర కొరియాతో సైనిక సంఘర్షణ తలెత్తితే పరిస్థితులు ఏవిధంగా ఉంటాయన్న విషయాన్ని ఈ రెండు విన్యాసాల్లో అమెరికా, దక్షిణ కొరియా ప్రదర్శించాయి. అయితే ఈ విన్యాసాలతో అమెరికా, దక్షిణ కొరియా తమను రెచ్చగొడుతున్నాయని, తమ దేశంపై దాడి జరిపేందుకే ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయని ఉత్తర కొరియా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండగా, స్వభావ రీత్యా ఈ విన్యాసాలు రక్షణాత్మక ధోరణితో కూడినవేనని అమెరికా, దక్షిణ కొరియా చెబుతున్నాయి.