అంతర్జాతీయం

ఉగ్రవాదంపై పోరుకు ఒక్కటి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, మే 9: ఎలాంటి దాడినైనా రష్యా తిప్పి కొట్టగలదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అయితే ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కటి కావాలని ఆయన అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం మాస్కోలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో పుతిన్ మాట్లాడుతూ ‘గతంలో జరిగిన యుద్ధాలు నేర్పిన పాఠాలు మేము ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేశాయి. రష్యా సైనిక దళాలు ఎలాంటి దాడినయినా తిప్పి కొట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాయి’ అని అన్నారు. నేటి జీవన విధానం కూడా మనం మన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునేలా చేశాయని, అయితే ఉగ్రవాదం, తీవ్రవాదం, నియో నాజీయిజంపై పోరాడడానికి మొత్తం ప్రపంచం ఒక్కటి కావలసిన అవసరం ఉందని కూడా పుతిన్ అన్నారు. అలాంటి సహకారానికి రష్యా సిద్ధంగా ఉందని, రష్యా ఎప్పుడు కూడా శాంతి కాముకుల పక్షానే నిలుస్తూ వస్తోందన్నారు. మాస్కోలోని రెడ్‌స్క్వేర్ వద్ద జరిగిన ఈ వేడుకల్లోను రష్యా తన సైనిక పాటవాన్ని, ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్లు, యుద్ధ విమానాల విన్యాసాలను మాత్రం రద్దు చేశారు. సిరియాలోని హ్మెమిమ్ ఎయిర్ బేస్‌లో ఉన్న రష్యా బలగాలు కూడా ఈ వేడుకలను జరుపుకొన్నాయి.