అంతర్జాతీయం

ఉ.కొరియాకు వెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 10: ఉత్తర కొరియాకు వెళ్లొద్దని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. ఉత్తరకొరియాలో నాలుగో అమెరికా పౌరుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ఈ హెచ్చరిక జారీ చేసింది. అక్కడకు వెళ్తే అరెస్టు, దీర్ఘకాలిక నిర్బంధం వంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అమెరికాలో నేరంగా పరిగణించని చర్యలను కూడా ఉ.కొరియాలో నేరంగా పరిగణిస్తున్నారని తెలిపింది. ఈ ట్రావెల్ వార్నింగ్‌ను కాదని, ఉ.కొరియాలోకి ప్రవేశిస్తే, అక్కడ మీకు గోప్యత ఉండబోదని, మీ యుఎస్‌బి డ్రైవ్‌లు, సిడిలు, డివిడిలు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, లాప్‌టాప్‌లు వంటి వాటినన్నింటినీ తనిఖీ చేస్తారని హెచ్చరించింది. కిమ్ హాక్-సంగ్‌ను దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే అభియోగంపై ఉ.కొరియాలో అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది.