అంతర్జాతీయం

నిన్ను తీసేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 10: అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వరుస వివాదాలతో సంచలనం రేకెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఏకంగా ఎఫ్‌బిఐ అధినేత జేమ్స్ కోమినే బర్తరఫ్ చేశారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ బృందం రష్యాతో కుమ్మక్కైందా? లేదా? అనే అంశంపై కోమి సారథ్యలోనే దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఆయనకు ఉద్వాసన పలకడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ‘ఈరోజు నుంచి మీ సర్వీసులను రద్దు చేస్తున్నాం. నిన్ను పదవి నుంచి తొలగిస్తున్నాను’ అంటూ కోమికి ట్రంప్ ఓ లేఖ రాశారు. ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా పదేళ్లపాటు అధికారంలో ఉండాల్సిన ఆయన పదవీకాలం నాలుగేళ్లకే దీంతో ముగిసినట్టయ్యింది. ఎఫ్‌ఐబి చీఫ్ పదవి నుంచి కోమిని తొలగించడానికి బలమైన కారణాలే ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పని చేసిన హిల్లరీ క్లింటన్ ప్రయివేట్ యూనియన్ వ్యవహారంలో కోమి వ్యవహరించిన తీరును ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎఫ్‌బిఐ వంటి తలమానికమైన సంస్థకు సారథ్యం వహించే సామర్థ్యం ఆయనకు ఎంతమాత్రం లేదన్నారు. ఎఫ్‌బిఐపై ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పునరుద్ధరించే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కుమ్మక్కయ్యే అవకాశం లేకపోలేదన్నట్టుగా కోమి తన వాంగ్మూలం వినిపించడం తెలిసిందే.

చిత్రం.. ఎఫ్‌బిఐ చీఫ్‌ జేమ్స్ కోమి