అంతర్జాతీయం

ఐక్యత, సామరస్యాలను బలోపేతం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డికోయ (శ్రీలంక), మే 12: శ్రీలంకలోని సింహళీయులు, తమిళులు తమ మధ్య ఐక్యతను, సామరస్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల జీవన పరిస్థితులను మెరుగు పరచడానికి లంక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు భారత్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తేయాకు తోటల పెంపకానికి నిలయమైన సెంట్రల్ ప్రావిన్స్‌లోని డికోయ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ తమిళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘వైవిధ్యం వేడుకకు పిలుపునిస్తుంది, సంఘర్షణకు కాదు. సింహళీయులు, తమిళుల మధ్య, వీరి రెండు భాషల మధ్య సామరస్యం ఉంది’ అని మోదీ అన్నారు. సుమారు మూడు దశాబ్దాల పాటు శ్రీలం క ప్రభుత్వానికి, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ)కి మధ్య సాగిన అంతర్యుద్ధం గాయాల నుంచి శ్రీలంక ఇంకా కోలుకుంటోంది. శ్రీలంక ద్వీపకల్పంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలతో కలిపి తమిళులకు ప్రత్యేక దేశం కావాలని ఎల్‌టిటిఇ పోరాడింది. ఈ అంతర్యుద్ధం ప్రజలను ఎన్నో కష్టనష్టాలకు గురిచేసింది. సుమారు 80 వేల నుంచి లక్ష మంది వరకు ప్రజలు చనిపోయారు. అయితే ‘ఐక్యత, సామరస్యం అనే దారాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వేరు చేయడం కాదు’ అని మోదీ అన్నారు.