అంతర్జాతీయం

‘చాయ్‌తో నాది ప్రత్యేక అనుబంధం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డికోయ (శ్రీలంక), మే 12: ‘చాయ్ (టీ)తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శ్రీలంక పర్యటనకు వచ్చిన మోదీ శుక్రవారం సెంట్రల్ ప్రావిన్స్‌లోని తేయాకు తోటల పెంపకందారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సిలోన్ టీ’ని ఆయన ప్రశంసిస్తూ, ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని అన్నారు. అయితే ఈ ‘సిలోన్ టీ’ని పెంచడానికి కార్మికులు కార్చిన చెమట, పడిన శ్రమ కొద్ది మందికి మాత్రమే తెలుసని ఆయన పేర్కొన్నారు. ‘చాయి పే చర్చ’ కార్యక్రమం నిజాయితీ గల కార్మికుల గౌరవానికి నిదర్శనమని ఆయన అన్నారు.
మోదీ దేశంలో, విదేశాల్లో పర్యటనల సందర్భంగా తరచుగా తాను చాయ అమ్మిన రోజులను గుర్తు చేస్తుంటారు. ‘మేము మీ పూర్వీకులను స్మరించుకుంటూ ఉంటాం. మీ పూర్వీకులు అయిన పురుషులు, స్ర్తిలు దృఢ సంకల్పంతో, ధైర్యంతో వారి జీవన యాత్రను భారత్ నుంచి సిలోన్‌కు కొనసాగించారు’ అని మోదీ బహిరంగ సభకు హాజరయిన వేలాది మంది తమిళులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాన మంత్రి రనిల్ విక్రమ్ సింఘే కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు.