అంతర్జాతీయం

ఉగ్రవాదానికి మూలం విద్వేషమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 12: ప్రపంచవ్యాప్తంగా హింసాకాండ పెరిగిపోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ నేడు కేవలం దేశాల మధ్య ఘర్షణలే కాకుండా ఆలోచనా ధోరణులు, విద్వేషం, హింసాకాండ వేళ్లూనుకోవడం లాంటి కారణాలవల్ల ప్రపంచ సుస్థిర శాంతికి ముప్పు ఏర్పడుతోందని అన్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ, తమ ప్రాంతంలో ఉగ్రవాదానికి విద్వేషమే ప్రధాన కారణమని అన్నారు. ఈ ప్రాంతంలో విద్వేష పూరిత సిద్ధాంతాలు, వాటిని పెంచి పోషిస్తున్న వారు చర్చలకు తలుపులను మూసివేశారని, హత్యలు, హింసాకాండను మాత్రమే ఎంచుకుంటున్నారని పరోక్షంగా దాయాది దేశమైన పాకిస్తాన్‌నుద్దేశించి అన్నారు.
‘ మన ప్రాంతంలోని ఉగ్రవాదం ఇలాంటి విచ్ఛిన్నకర ధోరణులకు బలమైన నిదర్శనం’ అని ఆయన అన్నారు. ఈ రోజు ప్రపంచ సుస్థిర శాంతికి అతి పెద్ద సవాలు ఉగ్రవాదమేనని , దీనికి దేశాల మధ్య ఘర్షణలే కారణం కావాల్సిన అవసరం లేదని, ఆలోచనా ధోరణులు, విద్వేషం, హింసాకాండ వేళ్లూనుకుని పోయిన సంస్థలు, పరికరాలు కూడా కారణమవుతున్నాయని ప్రధాని అన్నారు. ఇలాంటి హింసాయుత పరిస్థితుల్లో బౌద్ధమతం బోధించిన శాంతి సందేశమే సరయిన సమాధానం అవుతుందని ఆయన అన్నారు. బుద్ధుడి శాంతి సందేశమే ప్రపంచవ్యాప్తంగా పెరిగి పోతున్న హింసాకాండకు పరిష్కార మార్గం చూపుతుందని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. ‘ప్రపంచానికి బుద్ధుడిని, ఆయన బోధనలనే అమూల్యమైన బహుమతులను ఇచ్చే మహదవకాశం మన ప్రాంతానికి లభించింది’ అని అన్నారు. మన పరిపాలనలో, సంస్కృతిలో, సిద్ధాంతాల్లో బౌద్ధమతం, దానికి చెందిన వివిధ శాఖలు బలంగా వేళ్లూనుకుని పోయాయని ఆయన చెప్పారు. దక్షిణాసియా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలు బుద్ధుడి జన్మస్థానంతో సంబంధాలు కలిగి ఉన్నామని గర్వంగా చెప్పుకొంటున్నాయన్నారు.

చిత్రం.. శుక్రవారం కొలంబోలో జరిగిన అంతర్జాతీయ పద్నాలుగవ వేసక్ దినోత్సవ ప్రారంభ సమావేశంలో భారత ప్రధాని మోదీ