అంతర్జాతీయం

ప్రపంచ వేదికలపై పాక్‌ను ఒంటరి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 13: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం, జమ్మూకాశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులకు నిధులు సమకూర్చటం వల్ల దక్షిణాసియాలో శాంతికి పెను సవాలు నెలకొందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అందువల్ల అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను ఏకాకిని చేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం ఇక్కడ విదేశాలలోని బిజెపి స్నేహితులను (ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ద బిజెపి) ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ కేంద్రంగా పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం వల్ల భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్న కుట్రదారులకు వ్యతిరేకంగా ఉమ్మడి చర్య తీసుకొని శిక్షించవలసిన సమయం ఆసన్నమయిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదమనేది మానవత్వానికి వ్యతిరేకంగా ముంచుకొచ్చిన ఉపద్రవమని ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదం మొత్తం రీజియన్‌లోనే శాంతిని కబళిస్తోందని, ఆర్థిక వృద్ధికి విఘాతం కలిగిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి శాంతియుత సహజీవనం, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి, సార్క్ దేశాల పురోగతి పట్ల విశ్వాసం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ)కు చెందిన మసాలా బాండ్‌ను లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో విడుదల చేయడానికి గడ్కరీ ఇక్కడికి వచ్చారు. భారత్‌లో వౌలిక సౌకర్యాల అభివృద్ధికి నిధులు సేకరించడానికి ఈ మసాలా బాండ్‌ను విడుదల చేశారు. ఈ బాండ్ ఇప్పటికే రూ. మూడు వేల కోట్లకు పైగా విలువ గల చందాలను కలిగి ఉన్నది. ఈ బాండ్‌కు మరిన్ని నిధులు సమకూరుతాయని భావిస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ (టిఎఫ్‌ఎల్)తో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కూడా గడ్కరీ ఒక ప్రణాళికకు తుది రూపం ఇచ్చారు.