అంతర్జాతీయం

పగతో రగిలిపోతున్న లాడెన్ కుమారుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 13: అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా పగతో రగిలి పోతున్నాడని, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడని అమెరికా గూఢచార సంస్థ ఎఫ్‌బిఐకి చెందిన మాజీ ఏజంట్ ఒకరు చెప్తున్నారు. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌పై అమెరికా జరిపిన నాటకీయ దాడిలో ఒసామా బిన్ లాడెన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత కొంతకాలానికి అల్‌ఖైదాకు చెందిన కొన్ని వ్యక్తిగత లేఖలను కూడా అమెరికా స్వాధీనం చేసుకుంది. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు హంజా పేర్కొన్న లేఖ కూడా వాటిల్లో ఉందని ఎఫ్‌బిఐ మాజీ ఏజంట్ అయిన అలీ సౌఫాన్ సిబిఎస్ న్యూస్ చానల్‌కు చెప్పారు. హంజా తన 22వ ఏట ఆ లేఖ రాసినట్లుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హంజాకు 28 ఏళ్లు ఉంటాయి.
అమెరికాలో అల్‌ఖైదా దాడుల అనంతరం ఆ దాడి దర్యాప్తుకు అలీ సౌఫాన్ నాయకత్వం వహించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన లాడెన్‌కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ‘మీ ప్రతి చూపు, ప్రతి నవ్వు, ప్రతి మాటా నేను గుర్తుంచుకుంటాను’ అని హంజా తన తండ్రికి రాసిన మరో లేఖలో పేర్కొన్నట్లు సౌఫాన్ చెప్పారు.