అంతర్జాతీయం

వెన్నులో వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 13: కంప్యూటర్ హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా మరోసారి పంజా విసిరారు. ఏకంగా అమెరికా జాతీయ భద్రతా ఏజన్సీ ఉపయోగించే హ్యాకింగ్ టూల్స్‌నే దొంగిలించారు. తద్వారా శుక్రవారం పలు దేశాల్లోని వేలాది కంప్యూటర్లలోకి రాన్సమ్ వేర్ వైరస్‌ను చొప్పించి సమాచారాన్ని చోరీ చేశారు. ‘వాన్న క్రై’ పేరుతో కంప్యూటర్లలోకి శరవేగంగా చొచ్చుకు పోతున్న ఈ రాన్సమ్ వేర్ కారణంగా భారత్ సహా దాదాపు వంద దేశాల్లో లక్షకు పైగా కంప్యూటర్లు దాడికి గురయ్యాయి. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఈ కంప్యూటర్లను స్తంభింపజేశారు. మొత్తం లక్షా 30 వేలకు పైగా కంప్యూటర్లలోని సమాచారాన్ని వీరు తస్కరించారని భావిస్తున్నారు. సైబర్ దాడికి నారత్ కూడా గురయినట్లు భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్‌టి-ఐ) డైరెక్టర్ జనరల్ గుల్షన్ రాయ్ ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుకు చెందిన 102 కంప్యూటర్ సిస్టమ్‌లు ముఖ్యంగా విండోస్ ఎక్స్‌పిని ఉపయోగించే సిస్టమ్‌లు ఈ దాడికి గురయినట్లు గుర్తించామని ఆయన చెప్పారు., అంతమాత్రాన ఆ ఒక్క రాష్టమ్రే ఈ దాడికి గురయినట్లు భావించరాదని, సోమవారం ఆఫీసులు తిరిగి తెరిచిన తర్వాత దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో తమకు తెలియవచ్చని కూడా ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీ భద్రతా వ్యవస్థ ఉన్న జాతీయ భద్రతా ఏజన్సీ ఉపయోగించే హ్యాకింగ్ టూల్స్‌నే వీరు ఉపయోగించడం గమనార్హం. అంతర్జాతీయ కొరియర్ సంస్థ ఫెడెక్స్, బ్రిటన్‌లోని పలు ప్రముఖ ఆస్పత్రులు, స్పెయిన్‌కు చెందిన టెలికాం దిగ్గజం టెలిఫోనికా, పోర్చుగల్, అర్జెంటీనా టెలికాం సంస్థలు ఈ సైబర్ దాడికి గురయిన వాటిలో ఉన్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రేనాల్ట్ అయితే ముందుజాగ్రత్త చర్యగా ప్రాన్స్, స్లోవేనియాలోని తమ కార్ల తయారీ యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ దాడి వెనుక ఉన్న వైరస్‌ను తాము గుర్తించినట్లు రష్యాకు చెందిన రెండు సెక్యూరిటీ సంస్థలు కాస్పర్‌స్కీ లాబ్, అవస్తా పేర్కొన్నాయి.
ఈ వైరస్ క్షణాల్లో కంప్యూటర్ వ్యవస్థను స్తంభింపజేస్తుంది. కంప్యూటర్ వ్యవస్థ స్తంభించిన కొద్ది సేపటికే భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తే గానీ కంప్యూటర్ తిరిగి పని చేయదంటూ ఒక మెస్సేజ్ కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. ప్రధానంగా డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్స్ ద్వారా ఈ చెల్లింపులు జరపాలని కోరుతుంటారు. ఈ సైబర్ దాడికి ప్రధానంగా బ్రిటన్‌లోని అత్యధిక ఆస్పత్రుల ఐటి వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. దీంతో అక్కడ జాతీయ ఆరోగ్య భద్రతా సేవలు దాదాపుగా స్తంభించి పోయాయి. ఆస్పత్రులు చేసేది లేక తమ కంప్యూటర్లను కట్టేసి రోగులను ఇతర ఆస్పత్రులకు పంపిస్తున్నాయి. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఆస్పత్రులకు రావద్దని కూడా రోగులకు సలహా ఇస్తున్నాయి. సైబర్ దాడి కారణంగా వైద్య సేవల ఐటి వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, రోగుల క్షేమం దృష్ట్యా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామని బ్రిటన్ వైద్య అధికారులు చెప్తున్నారు. కాగా, కొన్ని ఆస్పత్రులు హ్యాకర్లు కోరినట్లుగా సొమ్ము చెల్లించి తిరిగి తమ కంప్యూటర్లను పని చేసేలా చేయించుకొన్నాయి కూడా. ఈ సైబర్ దాడి ప్రభావం రష్యాలో అత్యధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సైబర్ దాడి కారణంగా మరో పెనుముప్పు కూడా ఎదురుకాబోతోందని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ వైరస్ కంప్యూటర్లలోకి చొరబడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇంకోవైపు డబ్బు డిమాండ్ చేస్తూ కంప్యూటర్ స్క్రీన్స్‌పై ప్రత్యక్షమయ్యే సందేశాలు ఇప్పుడు వాట్సాప్‌లోను ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. ఇది మరింత విస్తరించి పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం లేక పోలేదని, ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడిగా ఇది మారే ప్రమాదం ఉందని కూడా వారంటున్నారు. కాగా, భారత్, రష్యా దేశాలు ఇప్పటికీ చాలావరకు మైక్రోసాఫ్ట్ ఎఖ్స్‌పి సాఫ్ట్‌వేర్‌నే వాడుతున్నందున ఆ దేశాలు ఈ సైబర్ దాడికి తీవ్రంగా గురయ్యే ప్రమాదం ఉందని హెల్సింకీలోని సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ ఎఫ్-సెక్యూర్‌లో చీఫ్ రిసెర్చ్ ఆఫీసర్ మిక్కో హిప్పోనన్ చెప్పడం గమనార్హం.
జి-7 దేశాల ఆర్థిక మంత్రుల భేటీ
కాగా, ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లోని కంప్యూటర్లపై భారీ ఎత్తున సైబర్ దాడులు జరిగిన నేపథ్యంలో ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై బారిలో జరుగుతున్న ఏడు అగ్రరాజ్యాల గ్రూపు(జి-7) ఆర్థిక మంత్రుల సమావేశంలో చర్చించారు. వాస్తవానికి శుక్రవారం సైబర్ దాడులు వెలుగులోకి రావడానికి ముందే ఈ దేశాల నేతలు సైబర్ దాడుల వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడానికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. కాగా, శనివారం ఈ అంశంపై చర్చించిన ఈ నేతలు చర్చల చివరి రోజయిన ఆదివారం కూడా ఇదే అంశంపై ప్రధానంగా దృష్టిపెట్టవచ్చని తెలుస్తోంది.