అంతర్జాతీయం

బాధ్యతలు స్వీకరించిన మేక్రాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 14: ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో 39 ఏళ్ల మేక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించినట్లయింది. వారం రోజుల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత మేక్రాన్ ఫ్రాంకోయిస్ హోలాండేనుంచి అధికార బాధ్యతలు స్వీకరించారు. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయమే మేక్రాన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన ఎలిసీ ప్యాలెస్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. ప్రస్తుత అధ్యక్షుడు హోలాండే స్వయంగా స్వాగతం పలికి తోడ్కొని వెళ్లారు. అనంతరం ఇరువురు నేతలు ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హోలాండే ఫ్రాన్స్ అణ్వస్త్రాలకు సంబంధించిన కోడ్‌లను మేక్రాన్‌కు అందజేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు, అధ్యక్షుడి సిబ్బంది కరతాళ ధ్వనుల మధ్య హోలాండే అక్కడినుంచి కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి అధ్యక్షుడు లారెన్ ఫాబియస్ మేక్రాన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేసిన తొలి ప్రసంగంలో మేక్రాన్ ఫ్రెంచ్ ప్రజలు ఎన్నికల్లో ఒక ఆశా కిరణాన్ని ఎన్నుకొన్నారని, మార్పును కోరుకుంటున్నామని చాటారని అన్నారు. బ్రిటన్ నిష్క్రమణ కారణంగా బలహీనపడిన ఐరోపా యూనియన్‌ను తన పదవీ కాలంలో తిరిగి బలోపేతం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మేక్రాన్ పదవీ స్వీకార కార్యక్రమానికి ఆయన భార్య 64 ఏళ్ల బ్రిగ్గిటీ ప్రత్యేకంగా విచ్చేశారు. కార్యక్రమాల చివర్లో 21 తుపాకులను పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మేక్రాన్ ఆర్క్ డి ట్రియోంఫేకు వెళ్లి అజ్ఞాత జవాను సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. మేక్రాన్ అధ్యక్షుడిగా తొలివారం తన కార్యాలయంలో బిజీబిజీగా గడపనున్నారు. ఆయన వచ్చే సోమవారం బెర్లిన్ వెళ్లి జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశం కానున్నారు. అలాగే అదేరోజు ఫ్రాన్స్ నూతన ప్రధాని పేరును సైతం ప్రకటించనున్నారు. ఇప్పటివరకు ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయని మేక్రాన్ తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గమనార్హం. నిజానికి మేక్రాన్‌ను రాజకీయాలకు పరిచయం చేసింది హోలాండే. మొదట మేక్రాన్‌ను తన సలహాదారుగా నియమించుకున్న ఆయన ఆ తర్వాత ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగించారు.

చిత్రం..ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మేక్రాన్‌కు బాధ్యతలు అప్పగిస్తున్న మాజీ అధ్యక్షుడు హోలాండే