అంతర్జాతీయం

అది హ్యాకర్ల దుశ్చర్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 16: ప్రపంచాన్ని చుట్టుముట్టిన సైబర్ దాడికి అమెరికా ఇంటెలిజన్స్ ఏజన్సీలను నిందిస్తున్న వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హోంలాండ్ సెక్యూరిటీ సలహాదారయిన టామ్ బాస్సెర్ట్ జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఎస్‌ఏ)ని నిందించవద్దని, హ్యాకర్లను మాత్రమే నిందించండంటూ సలహా ఇచ్చారు. గత శుక్రవారంనుంచి ‘వాన్నాక్రై’ మాల్‌వేర్ దాదాపు 150 దేశాల్లోని 3 లక్షలకు పైగా కంప్యూటర్లలోకి చొరబడిన విషయం తెలిసిందే. నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ కనుగొన్న మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లోని ఒక లోపాన్ని కనుగొన్న గుర్తు తెలియని హ్యాకర్లు దాన్ని సద్వినియోగం చేసుకున్నారని సైబర్ సెక్యూరిటీ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనికి అమెరికా ప్రభుత్వం బాధ్యత కూడా కొంత ఉందని మైక్రోసాఫ్ట్ జనరల్ కాన్సల్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ బ్రాడ్‌స్మిత్ సోమవారం విమర్శించారు. అమెరికా ఇంటెలిజన్స్ ఏజన్సీలు సాఫ్ట్‌వేర్‌ను పెద్దఎత్తున నిల్వ చేస్తున్నాయని, అందుకే హ్యాకర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నారని ఆయన అన్నారు. వికీలీక్స్ వ్యవహారంలో సిఐఏ వైఫల్యాన్ని మనం చూశామని, ఇప్పుడు ఎన్‌ఎస్‌ఏనుంచి దొంగిలించిన సాఫ్ట్‌వేర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. అయితే హ్యాకర్లు దొంగిలించిన టూల్ భారీ మొత్తంలో డేటాను నిల్వ చేయడానికి ఎన్‌ఎస్‌ఏ కనుగొన్న టూల్ కాదని బాస్సెర్ట్ అన్నారు. అంతేకాదు నేరగాళ్లు లేదా విదేశాలకు చెందిన బృందాలు దీన్ని అభివృద్ధి చేసి ఉంటాయని కూడా ఆయన చెప్పారు.