అంతర్జాతీయం

టోరీలకే మళ్లీ పట్టం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 8:ఓ పక్క ఉగ్రవాదం, మరోపక్క బ్రెగ్జిట్ వివాదం నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలు గురువారం అత్యంత ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య జరిగాయి. అధికారం నిలబెట్టుకోవడమే కాకుండా భారీ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో ప్రధాని ధెరీసామే తీసుకున్న ముందస్తు ఎన్నికల నిర్ణయం ఆమెకే అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. ఆయితే ఆమె ఆశించిన రీతిలో మాత్రం మెజార్టీ రాకపోవచ్చుననీ స్పష్టం అవుతోంది. జెరెమి కార్బిన్ సారథ్యంలోని లేబర్ పార్టీ కంటే టోరీలు పదిపాయింట్ల ఆధిక్యతతో ఉన్నట్టుగా సర్వే లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుత సంకేతాల్ని బట్టి అధికార పార్టీకి 44శాతం, ప్రతిపక్ష లేబర్ పార్టీకి 34శాతం ఓట్లు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల తుది ఫలితాలపై వంద మిలియన్ పౌండ్లకు పైగా బెట్టింగ్ జరిగినట్టూ కథనాలు వెలువడుతున్నాయి. ధెరీసాకు 70సీట్లకు పైగా మెజార్టీ వస్తుందన్న యూకే ప్రధాన బుక్‌మేకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హంగ్ పార్లమెంట్ ఏర్పడేందుకూ అవకాశం లేకపోలేదన్నది మరో వాదన. 650సీట్లు కలిగిన దిగువ సభలో (హౌస్ ఆఫ్ కామన్స్) మెజార్టీ రావాలంటే ఏ పార్టీ అయినా 326సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది.