అంతర్జాతీయం

పలకరించుకున్న మోదీ, షరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తానా, మే 8: షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కలుసుకొని పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సభ్య దేశాల నేతల గౌరవార్థం ఇక్కడ ఇచ్చిన ఓ కార్యక్రమం సందర్భంగా వీరు కలుసుకున్నారు. ఇటీవలే హార్ట్ సర్జరీ చేయించుకున్న షరీఫ్ ఆరోగ్య పరిస్థితిని మోదీ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అయితే మోదీ, షరీఫ్‌ల మధ్య భేటీ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, పాకిస్తాన్‌నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్‌బాగ్లే తెలిపారు.

చిత్రం.. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ