అంతర్జాతీయం

థెరీసాకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 9:మూడేళ్ల ముందుగానే పార్లమెంట్ ఎన్నికలకు దిగిన బ్రిటన్ ప్రధాని ధెరీసామే వ్యూహం బెడిసికొట్టింది. పార్లమెంట్‌లో బలమైన మెజార్టీ వస్తుందని ఆశించిన ఆమెకు ఆశనిపాతమే ఎదురైంది. గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు విస్మయకర తీర్పునే ఇచ్చారు. ఫలితంగా హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. అధికార కన్సర్వేటివ్ పార్టీకి గానీ, ప్రతిపక్ష లేబర్ పార్టీకి గానీ మెజార్టీ రాని ఈ ఎన్నికలు బ్రిటన్ రాజకీయాల్ని సంక్షోభంలో పడేశాయి. ఉన్న మెజార్టీ పోవడంతో నార్తర్న్ ఐరిష్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ధెరీసాకు ఏర్పడింది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ధెరీసా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని లేబర్ పార్టీ అధినేత జెరెమి కోర్బిన్ డిమాండ్ చేశారు. అయితే డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీతో (డియుపి) పొత్తు పెట్టుకుని మైనార్టీ ప్రభుత్వాన్నయినా ఏర్పాటు చేస్తాను తప్ప రాజీనామా ప్రసక్తే లేదని ధెరీసా తెగేసి చెబుతున్నారు. ఓ పక్క బ్రెగ్జిట్ చర్చలు, మరో పక్క ఉగ్రవాద సమస్యలు పొంచి ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో బ్రిటన్‌కు బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఎంతో అవసరమని తెలిపారు. డియూపీతో తమకు దీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీనితో చేతులు కలిపి కన్సర్వేటివ్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా మంచి ఫలితాలనే సాధించింది. దీనితో 19 నుంచి ప్రారంభం కానున్న బ్రెగ్జిట్ చర్చల పరిస్థితి ఏమిటన్న రాజకీయ అయోమయం ఏర్పడింది. మొత్తం 650 సీట్లలో టోరీలకు 318సీట్లు, లేబర్ పార్టీకి 262 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 326సీట్లను సంతరించుకోలేక పోవడంతో హంగ్ అనివార్యమైంది. అయితే పది సీట్లను గెలుచుకున్న డియుపి పార్టీ కలిసి వస్తే ధెరీసా కొంత మేర ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఇందుకోసం ఆమెతో చర్చలు జరుపుతామని డియుపి పార్టీ నాయకుడు అర్లెన్ ఫోస్టర్ స్పష్టం చేశారు. అయితే ఇందుకు తాము ఏరకమైన షరతులు విధించే అవకాశం ఉందన్న దానిపై వౌనం వహించారు. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలన్నీ కన్సర్వేటివ్ పార్టీకి అవసరమైన మెజార్టీ వస్తుందని ఊదరగొట్టిన నేపథ్యంలో కనీస మెజార్టీ కూడా రాకపోవడం ధెరీసా మేకు అవమానమేనని, ఆమె తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని లేబర్ పార్టీ అధినేత కోర్బిన్ డిమాండ్ చేశారు. ‘్ధరీసా ఓట్లను కోల్పోయింది. మద్దతును కోల్పోయింది. ప్రజల విశ్వాసాన్నీ కోల్పోయింది’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఐరోపా యూనియన్‌తో బలమైన చర్చలు జరపాలన్న ఉద్దేశంతోనే మూడేళ్ల ముందుగానే మధ్యంతర ఎన్నికలకు దిగిన ధెరీసాపై రాజీనామా వత్తిడి తీవ్రమవుతోంది. ఎన్నికలకు ముందున్న మెజార్టీ కూడా అధికార పార్టీకి రాకపోవడం వల్ల బ్రెగ్జిట్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది. 2016లో జరిగిన ఎన్నికల్లో 48శాతం మంది ప్రజలు ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణను వ్యతిరేకించారు. ఇప్పుడు వారి ఆశలకు ఈ ఫలితాలు మరింత బలాన్నిచ్చినట్టుగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రెగ్జిట్ చర్చల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.