అంతర్జాతీయం

భారతీయుల జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 9: బ్రిటన్ పార్లమెంటుకు తాజాగా జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు విజయపతాకం ఎగురవేశారు. తొలిసారిగా ఓ సిక్కు మహిళ, సంప్రదాయ తలపాగా ధరించే మరో సిక్కు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కాగా, తాజా ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ సంతతి వారిలో ఏడుగురు గెలుపొందగా, కన్సర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసిన అయిదుగురు గెలుపొందారు. గత పార్లమెంటులో లేబర్ పార్టీ తరఫున అయిదుగురు భారత సంతతివారు ఉండగా, ఇప్పుడా సంఖ్య ఏడుకు పెరగడం గమనార్హం. లేబర్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రీతికౌర్ గిల్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్థానంనుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమెకు 24,124 ఓట్లు రాగా, కన్సర్వేటివ్ పార్టీ ప్రత్యర్థికి కేవలం 6,917 ఓట్లు వచ్చాయి. ఓ సిక్కు మహిళ కామన్స్ సభకు ఎన్నిక కావడం ఇదే తొలిసారి. తాను పుట్టిపెరిగిన ఎడ్జ్‌బాస్టన్‌కు ఎంపీగా ఎంపికయినందుకు ఎంతో ఆనందంగా ఉందని గిల్ అంటూ, ఇక్కడి ప్రజలతో మమేకమై వారి కోసం అంకిత భావంతో సేవ చేస్తానని చెప్పింది. తన్‌గా పిలవబడే తన్‌మన్‌జీత్ సింగ్ దేశీ స్లౌహ్ స్థానంనుంచి గెలుపొందారు. ఆయన సిక్కుల సంప్రదాయ తలపాగా ధరిస్తారు. ఆయన కన్సర్వేటివ్ పార్టీ ప్రత్యర్థిపై 16,998 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తనకు ఈ అవకాశమిచ్చిన లేబర్ పార్టీకి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదే పార్టీనుంచి పోటీ చేసిన మరో టర్బన్ ధారి కుల్‌దీప్ సహోటా కేవలం 720 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. కన్సర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రీతి పటేల్ ఎసెక్స్‌లోని విథమ్‌నుంచి భారీ మెజారిటీతో గెలుపొందగా, అలోక్ శర్మ రీడింగ్ వెస్ట్‌నుంచి, శైలేష్ వర కేంబ్రిడ్జ్‌షైర్ నార్త్‌నుంచి గెలుపొందారు. రిషి సునక్, సుయెల్లా ఫెర్నాండెజ్‌లు వరసగా రెండోసారి కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా చాలా ఏళ్లుగా లేబర్ పార్టీ ఎంపిగా ఉన్న కీత్‌వాజ్ తన లీసెస్టర్ ఈస్ట్ స్థానంనుంచి మరోసారి భారీ మజారిటీతో గెలుపొందగా ఆయన సోదరి వలేరి వాజ్ సైతం వాల్‌సాల్ సౌత్ స్థానంనుంచి గెలుపొందారు. సీమా మల్హోత్రా తన ఫెల్తమ్,హెస్టన్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోగా, వీరేంద్ర శర్మ సైతం ఈలింగ్ సౌతాల్‌నుంచి తిరిగి గెలుపొందారు.