అంతర్జాతీయం

సౌదీలోనూ దాడులు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 10: సౌదీ అరేబియాలో దాడులు నిర్వహిస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. టెహ్రాన్‌లో దాడులకు పాల్పడి 17 మంది ప్రాణాలను బలితీసుకున్నది తామేనని ప్రకటించుకున్న ఐసిస్ తాజాగా ఈ హెచ్చరిక చేసిందని ‘సైట్’ అనే ఇంటెలిజెన్స్ గ్రూపు శుక్రవారం వెల్లడించింది. ఇరాన్‌లో బుధవారం పార్లమెంట్‌తోపాటు అయతుల్లా ఖొమైనీ మాసోలియంపై ఆత్మాహుతి బాంబర్లు, సాయుధ దుండగులు దాడులకు తెగబడి 17 మందిని హత్య చేసిన విషయం విదితమే. ఈ దాడులకు పాల్పడింది తామేనని ప్రకటించుకున్న ఐసిస్, ఇరాన్‌లో షియా తెగకు చెందిన ముస్లింలపై మరిన్ని దాడులు జరుపుతామని, సౌదీ అరేబియాను వదలబోమని హెచ్చరించింది. టెహ్రాన్‌లో దాడులకు ముందు రికార్డు చేసినట్లుగా భావిస్తున్న ఒక వీడియోలో ముసుగులు ధరించి ఉన్న ఐదుగురు ఉగ్రవాదులు ఈ హెచ్చరిక చేశారని ‘సైట్’ వెల్లడించింది.