అంతర్జాతీయం

బ్రిటిష్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన బెట్టింగ్‌రాయుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 11: బ్రిటన్‌లో తాజాగా నిర్వహించిన మధ్యంతర ఎన్నికల్లో నష్టపోయింది ఒక్క ప్రధాని థెరిసా మే మాత్రమే కాదు. ఆమె కన్సర్వేటివ్ పార్టీ భారీగా మెజారిటీతో విజయం సాధిస్తుందని నమ్మి భారీ మొత్తంలో బెట్టింగ్‌లు కాసినవారు కూడా పెద్దమొత్తాల్లో నష్టపోయారు.
కన్సర్వేటివ్ పార్టీ మెజారిటీపై పందెం కాసిన ఓ జూదరి అయితే ఏకంగా 70 వేల పౌండ్లు కోల్పోయాడట. గత మే నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ప్రతిపక్ష లేబర్ పార్టీని చిత్తుగా ఓడించిన తర్వాత బ్రిటిష్ బుక్‌మేకర్ విలియమ్ హిల్ వద్ద ఈ అజ్ఞాత జూదగాడు పందెం కాశాడట. త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో థెరిసా మే ఎట్టి పరిస్థితిలోను ఓడిపోరని బలంగా నమ్మిన అనేక మందిలో అతనూ ఒకడని బుక్‌మేకర్ చెప్పినట్లు ‘ది ఇండిపెండెంట్’ పత్రిక తెలిపింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన అన్ని ఒపీనియన్ పోల్స్‌లో ప్రధాన మంత్రి థెరిసా మేకు లేబర్ పార్టీ ప్రత్యర్థి జెరెమీ కోర్బిన్‌పై రెండంకెల ఆధిక్యత ఉండింది. దీంతో అందరు కూడా ఆధిక్యత ఎంత భారీగా ఉంటుందనే దానిపైనే బెట్టింగ్‌లు కాశారు. దాదాపు 20 మిలియన్ పౌండ్ల మేర బెట్టింగ్‌లు కాశారని అందులో ఎక్కువమంది టోరీలు (కన్సర్వేటివ్ పార్టీవారు) విజయం సాధిస్తారనే పందేలు కాశారని బుక్‌మేకర్ ప్రతినిధి జో క్రిల్లీ చెప్పారు. అయితే ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా ఉండడంతో చాలా మంది నష్టపోయారు. అయితే కన్సర్వేటివ్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని పందెం కాసిన లండన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 2 లక్షల పౌండ్ల దాకా గెలుచుకున్నాడని ఆ ప్రతినిధి చెప్పారు.